Wednesday, February 18, 2026
E-PAPER
Homeరాష్ట్రీయండిమాండ్స్‌ డే జయప్రదం

డిమాండ్స్‌ డే జయప్రదం

- Advertisement -

మెకానిక్‌ల రీ-కేటగిరైజేషన్‌ను నిలిపేయాలి
విద్యుత్‌ బస్సుల విధానంలో మార్పులు చేసి భద్రత కల్పించాలి : ఎస్‌డబ్ల్యూఎఫ్‌ రాష్ట్ర కమిటీ డిమాండ్‌
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌

విద్యుత్‌ బస్సుల పేరుతో మెకానిక్‌ల రీ-కేటగిరైజేషన్‌ను నిలిపివేయాలనీ, విద్యుత్‌బస్సుల విధానంలో మార్పులు చేసి ఆర్టీసీ ద్వారా అమలు చేయాలనీ, విద్యుత్‌ బస్సుల కోసం రాష్ట్ర బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని తదితర సమస్యలను పరిష్కారం చేయాలని కోరుతూ ఆర్టీసీ కార్మికులు ‘డిమాండ్స్‌ డే’ ను పాటించారు. ఈ కార్యక్రమంలో బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరు అయిన కార్మికులకు, నిరసన కార్యక్రమాలు నిర్వహించిన ఎస్‌డబ్ల్యూఎఫ్‌ కార్యకర్తలకు, సహకరించిన అన్నీ జిల్లా కమిటీలకు టీఎస్‌ఆర్టీసీ స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర కమిటీ ధన్యవాదాలు తెలిపింది. ఇప్పటికైనా టీజీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం స్పందించి మెకానిక్‌ల రీ-కేటగిరైజేషన్‌ను నిలిపి వేయాలని ఎస్‌డబ్ల్యూఎఫ్‌ విజ్ఞప్తి చేసింది.

ఆర్టీసీ బస్‌భవన్‌ వద్ద ‘డిమాండ్స్‌ డే’ లో పాల్గొన్న ఆ సంఘం రాష్ట్ర పధాన కార్యదర్శి వి.ఎస్‌. రావు మాట్లాడుతూ విద్యుత్‌ బస్సులను ఆర్టీసీ ద్వారా నడపకుండా ప్రైవేట్‌ కార్పొరేట్‌ సంస్థల ద్వారా జీసీసీ పద్ధతిలో నడపటం ఆర్టీసీ పైన తీవ్రభారం పడటమే కాక, మొత్తం కార్మికుల ఉద్యోగ భద్రతకు ముప్పు వస్తున్నదన్నారు. అందులో భాగమే హైదరాబాద్‌ రీజియన్‌లో మెకానిక్‌లను రీ- కేటగిరి చేసి కండక్టర్‌, డ్రైవర్‌గా పంపేందుకు సిద్ధ పడుతున్నారన్నారు. తక్షణమే ఆ ప్రత్తిపాదన ఉపశమహరించుకోవాలని కోరారు. కేంద్ర ప్రభుత్వ విద్యుత్‌ బస్సుల విధానంలో మార్పులు చేసి ఆర్టీసీ నిర్వహించుకునేలా చూడాలనీ రాష్ట్ర ప్రభుత్వం కూడా అందుకు అవసరమైన నిధులను 2026-27 బడ్జెట్‌లో కేటాయింపులు చేయాలని డిమాండ్‌ చేశారు.

విద్యుత్‌ బస్సుల విధానంలో మార్పులు కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి లేఖరాసి ఒత్తిడి చేయాలని ఎస్‌డబ్ల్యూఎఫ్‌ కోరుతుందన్నారు. ఈరోజు జరిగిన కార్యక్రమంలో భాగంగా సంగారెడ్డిలో యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు వీరాంజనేయులు, ఖమ్మంలో రాష్ట్ర కార్యదర్శి పి.సుధాకర్‌, మణుగూరులో రాష్ట్ర ఉపాధక్షులు బి. రాంబాబు, వరంగల్‌లో రాష్ట్ర కార్యదర్శి బి. ఉపేంద్రాచారి, బస్‌భవన్‌ వద్ద రాష్ట్ర ప్రచార కార్యదర్శి పి. రవీందర్‌ రెడ్డి, మాజీ కోశాధికారి ఎ. వెంకటేశ్వరరావు, బర్కత్‌పుర వద్ద రాష్ట్ర కార్యదర్శి చంద్ర ప్రకాష్‌, జీడిమెట్లలో ఉపాధ్యక్షులు కె. గీత, రాజేంద్రనగర్‌ లో రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్‌. కృష్ణ, సూర్యాపేటలో రాష్ట్ర కార్యదర్శి బత్తుల సుధాకర్‌, నల్గొండలో రాష్ట్ర కమిటీ సభ్యులు నర్సింహా తదితరులు నాయకత్వం వహించారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -