నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
సినిమాల పైరసీ కేసు నిందితుడు ఇమంది రవి (ఐబొమ్మ)కి హైకోర్ట్ మంగళవారం బెయిల్ మంజూరు చేసింది. గతేడాది నవంబర్‌లో అరెస్టయిన రవికి బెయిల్ మంజూరు ఉత్తర్వుల్లో పలు షతరులను విధించింది. హైదరాబాద్ నగరం విడిచి వెళ్లరాదనీ, సాక్షుల తారుమారుకు యత్నించరాదని ఆదేశించింది. ప్రతి రోజూ ఉదయం 11 గంటలకు సైబర్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) పోలీసుల ఎదుట హాజరుకావాలని పేర్కొంది. పాస్‌పోర్ట్ అప్పగించడంతో పాటు దేశం విడిచి వెళ్లరాదని పేర్కొంది. విచారణకు సహకరించాలని షరతులు విధించింది. సీసీఎస్‌లో నమోదైన పలు కేసుల్లో బెయిల్ ఇవ్వాలంటూ రవి దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్ కె. సుజన మధ్యంతర ఉత్తర్వులను జారీ చేశారు. విచారణ వచ్చే నెల రెండో వారానికి వాయిదా వేశారు.
ఐ బొమ్మ రవికి బెయిల్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



