Friday, June 19, 2026
E-PAPER
Homeఖమ్మంఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాహుల్ గాంధీ పుట్టిన రోజు వేడుకలు

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాహుల్ గాంధీ పుట్టిన రోజు వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ – అశ్వారావుపేట
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను శుక్రవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. అశ్వారావుపేట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చిన్నంశెట్టి సత్యనారాయణ, మున్సిపల్ వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ బాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కేక్ కట్ చేసి రాహుల్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం మిఠాయిలు పంపిణీ చేసి పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు దేశ రాజకీయాల్లో రాహుల్ గాంధీ పోషిస్తున్న పాత్రను ప్రశంసించారు. నాయకులు మాట్లాడుతూ దేశ ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడే నాయకుడిగా రాహుల్ గాంధీ ప్రత్యేక గుర్తింపు పొందారని పేర్కొన్నారు. రైతులు, యువత, మహిళలు, కార్మికులు, పేద ప్రజల సంక్షేమం కోసం ఆయన నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. దేశంలో ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ, రాజ్యాంగ రక్షణ కోసం ఆయన చేపడుతున్న కార్యక్రమాలు ప్రజల్లో విశేష ఆదరణ పొందుతున్నాయని అన్నారు.

అలాగే భారత్ జోడో యాత్ర, భారత్ జోడో న్యాయ యాత్ర తో దేశ ప్రజలతో ప్రత్యక్షంగా మమేకమై వారి సమస్యలను తెలుసుకుని కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారని కొనియాడారు. పార్లమెంట్‌లో సామాన్య ప్రజల గొంతుకగా ఆయన చేస్తున్న పోరాటం స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.

సామాజిక న్యాయం, సమానత్వం, సెక్యులరిజం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం రాహుల్ గాంధీ నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. యువతకు రాజకీయాల్లో అవకాశాలు కల్పించడం, మహిళా సాధికారతకు ప్రాధాన్యత ఇవ్వడం, రైతుల సమస్యల పరిష్కారం కోసం పోరాడడం వంటి అంశాల్లో ఆయన చూపుతున్న నిబద్ధత ప్రశంసనీయమని అన్నారు.

అశ్వారావుపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కార్యకర్తలు ఐక్యంగా పనిచేయాలని నాయకులు పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీని మరింత బలోపేతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆత్మ ( బీఎఫ్ఏసీ) ఛైర్పర్సన్ సుంకవల్లి వీరభద్ర రావు, కాంగ్రెస్ కౌన్సిలర్ లు, కాసాని పద్మశేఖర్,కానూరి మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -