నవతెలంగాణ – బల్మూరు
ఆన్లైన్ ద్వారా రైతులు బుకింగ్ చేసుకున్న యూరియాను శనివారం ప్రారంభించడం జరిగిందని తహశీల్దార్ శ్రీకాంత్ పిఏసీఎస్ చైర్మన్ రాజా వర్ధన్ రెడ్డి, వ్యవసాయ అధికారి నరేష్ ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ మరియు జిల్లా వ్యవసాయ అధికారి ఆదేశాల మేరకు మండలంలో యూరియా పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించినట్టు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా మండలంలో రైతుల అవసరాలకు సరిపడా యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. రైతులు ప్రతిరోజు ఉదయం 6:00 గంటలకు మరియు మధ్యాహ్నం 3:00 గంటలకు ఫర్టిలైజర్ యాప్‌లో యూరియా బుకింగ్ చేసుకోవచ్చని ఎంఏఓ సూచించారు. బుకింగ్ చేసుకున్న రైతులు తమ బుకింగ్ ఐడీ మరియు ఆధార్ కార్డుతో సంబంధిత ఎరువుల విక్రయ కేంద్రానికి వచ్చి యూరియాను కొనుగోలు చేసుకోవాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ సిబ్బంది, వ్యవసాయ విస్తరణ అధికారి ఏ ఈ ఓ రత్నారావు మరియు పలువురు రైతులు పాల్గొన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పారదర్శకంగా యూరియా పంపిణీ చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు.



