Wednesday, February 18, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆధ్యాత్మికతతో విలువల విద్యను అలవర్చుకోవాలి 

ఆధ్యాత్మికతతో విలువల విద్యను అలవర్చుకోవాలి 

- Advertisement -

– శ్రీ మాధవానంద సరస్వతి
నవతెలంగాణ – కామారెడ్డి

జిల్లా కేంద్రంలోని స్థానిక శ్రీ సరస్వతి శిశు మందిర్ లో బుధవారం 42వ వార్షికోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ మాధవానంద సరస్వతి హాజరై ప్రసంగించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికతను అలవర్చుకోవాలని, “మానవసేవనే మాధవసేవ” అనే భావనతో ఇతరులకు సహాయం చేసే గుణాన్ని పెంపొందించుకోవాలని సూచించారు.

క్రమశిక్షణకు మారుపేరు శిశు మందిర్ విద్యాసంస్థలేనని ఆయన అన్నారు. విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి విలువలతో కూడిన విద్య అవసరమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రాజు, పాఠశాల అధ్యక్షులు శ్యాంసుందర్, ప్రముఖులు హరిస్మరన్ రెడ్డి, గిరెడ్డి రాజిరెడ్డి, గంగారెడ్డి, మల్లేష్ యాదవ్, బొడ్డు శంకర్, ప్రిన్సిపాల్ నల్ల నాగభూషణం, అకాడమీ ప్రిన్సిపాల్ నగేష్, ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -