Friday, June 19, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రారంభానికి సిద్ధమైన శ్రీపాదరావు విగ్రహం

ప్రారంభానికి సిద్ధమైన శ్రీపాదరావు విగ్రహం

- Advertisement -

యుద్ధప్రతిపాధికన నిర్మాణం చేపట్టిన పిఏసిఎస్ చైర్మన్ మొండయ్య
నవతెలంగాణ – మల్హర్ రావు

మండల కేంద్రమైన తాడిచెర్లలో తహశీల్దార్ కార్యాలయం ప్రక్కన, పిఏసిఎస్ కార్యాలయానికి వెళ్లి మెయిన్ కమాన్ అనుకోని ఉమ్మడి రాష్ట్ర మాజీ స్పీకర్, మంథని నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత దుద్దిళ్ల శ్రీపాదరావు విక్రహ నిర్మాణం తుది దశకు చేరుకొని ప్రారంభానికి సిద్ధమైంది. విగ్రహ నిర్మాణానికి ఎన్ని ఆటంకాలు ఎదురైన తాడిచెర్ల పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొండయ్య యుద్ధప్రాతిపదికన విగ్రహ నిర్మాణ పనులు అన్ని హంగులతో అనతికాలంలోనే పూర్తి చేశారు. వేగంగా శ్రీపాదరావు విగ్రహం లక్షలు వెచ్చించి తన సొంత ఖర్చులతో పూర్తి చేయడంపై మొండయ్యకు దుద్దిళ్ల కుటుంబంపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నట్లుగా పలువురు అభినందిస్తున్నారు. గతంలో శ్రీపాదరావు విగ్రహం తాడిచెర్లలో నిర్మాణం చేపట్టాలని పలువురు నాయకులు ప్రయత్నాలు చెసిన ఫలితం లేకుండా పోయింది. మొండి ఘటంలా మొండన్న బట్టి విక్రమార్కుడిలా విగ్రహ నిర్మాణం పూర్తి చేయడంపై ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -