- హైదరాబాద్ చేరుకున్న త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్
నవతెలంగాణ-హైదరాబాద్: మహబూబ్ నగర్ లో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జరిగే బహిరంగ సభలో పాల్గొనేందుకు… త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ శుక్రవారం హైదరాబాద్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు సిపిఐ(ఎం) రాష్ట్ర సీనియర్ నాయకులూ డి. జి. నర్సింహా రావు, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్. వెంకట్రాములు శంషాబాద్ విమానాశ్రయంలో స్వగతం పలికారు. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర 4వ మహాసభలు మహబూబ్ నగర్ లో జరగనున్నాయి. ఈ సందర్భంగా నిర్వహించే బహిరంగ సభలో అయన ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ‘ఈ నెల 20,21,22 తేదీల్లో) 3 రోజుల పాటు జరిగే ఈ మహాసభల్లో రాష్ట్రంలోని వ్యవసాయ కార్మికుల స్థితిగతులపై చర్చించి, భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నట్లు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్. వెంకట్రాములు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని సంపన్నుల దోపిడీకి వ్యతిరేకంగా, కూలి రేట్ల పెంపు గ్రామీణ పేదలను, ఉపాధి కూలీలను, ఇతర కార్మికుల్ని ఐక్యం చేసి పోరాటాలకు సన్నద్ధమయ్యేలా ఈ మహాసభలు దిశా, నిర్దేశం చేయనున్నాయని పేర్కొన్నారు. రేపు మధ్యాహ్నం 12 గం.లకు మునిసిపల్ టౌన్ హాల్ నుంచి ప్రారంభమయ్యే భారీ ప్రదర్శన, బహిరంగ సభలో అధిక సంఖ్యలో పాల్గొని పార్టీశ్రేణులకు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.



