- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
ఉండడానికి గూడులేని నిరుపేదలకు ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు ప్రభుత్వం మంజూరు చేస్తోందని మండలంలోని ఇప్పలపల్లి సర్పంచ్ అబ్బినేని లింగస్వామి తెలిపారు. శుక్రవారం మంత్రి శ్రీదర్ బాబు,టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీనుబాబు ఆదేశాలతో గ్రామంలో ఇందిరమ్మ లబ్ధిదారులకు ముగ్గుపోసి భూమిపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ అక్కల దేవేందర్, వార్డు సభ్యులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
- Advertisement -


