- Advertisement -
నవతెలంగాణ – జుక్కల్
జుక్కల్ మండలం సావర్‌గావ్ గ్రామంలో శుక్రవారం ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు కొత్త బస్సు సర్వీస్ ను ప్రారంభించారు. బాన్సువాడ డిపోకు చెందిన ఈ బస్సు కండెబలూర్ – సావర్‌గావ్ – విఠల్‌వాడి మీదుగా కంగ్టి వరకు ఇకపై ప్రయాణికులకు సేవలు అందించనుంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. విద్యార్థులు, రైతులు, ఉద్యోగులకు, గ్రామీణ ప్రాంతాలకు మెరుగైన కనెక్టివిటీ అందించడమే మా ప్రభుత్వ లక్ష్యమన్నారు. దీనిని ప్రజలు వినియోగించుకోవాలన్నారు. చిరకాల కోరికను నెరవేర్చినందుకు ఎమ్మెల్యేకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.
- Advertisement -



