Saturday, June 20, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఫాస్ట్ ఫుడ్ గోదాంపై హెచ్-ఫాస్ట్ బృందం దాడి

ఫాస్ట్ ఫుడ్ గోదాంపై హెచ్-ఫాస్ట్ బృందం దాడి

- Advertisement -

కల్తీ ఆహార పదార్థాల స్వాధీనం
నవతెలంగాణ-సిటీబ్యూరో

కల్తీ ఆహార పదార్థాల తయారీపై హెచ్‌-ఫాస్ట్‌ (హైదరాబాద్ ఫుడ్ అడల్ట్రేషన్ సర్వైలెన్స్ టీమ్) బృందం, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ (ఎఫ్‌ఎస్‌ఓ)లు ప్రత్యేక నిఘా వేశారు. రెండు బృందాలు కలిసి శుక్రవారం చార్మినార్‌లోని హుస్సేనీఆలం పోలీస్ స్టేషన్ పరిధిలో ‘ఏఐ అక్బర్‌ ‌ఫాస్ట్‌ ‌ఫుడ్‌’ గోదాముపై ఆకస్మిక దాడి నిర్వహించారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేసిన ఈ బృందం సుమారు 110 కిలోల ఫ్రైడ్ చికెన్, 6 టన్నుల వంట నూనె (ఒక్కొక్కటి 15 లీటర్లు), కృత్రిమ రసాయన ఆహార రంగులను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి టాస్క్‌‌ఫోర్స్‌ డీసీపీ వైభవ్ రఘునాథ్ గైక్వాడ్ తెలిపిన వివరాల మేరకు.. విశ్వసనీయ సమాచారంతో చార్మినార్‌లోని పంచ్ మొహల్లా, న్యూలాడ్ బజార్‌లో ఉన్న ‘మెసర్స్ అల్ అక్బర్ ఫాస్ట్ ఫుడ్ అండ్ గోడౌన్’ ప్రాంగణాన్ని తనిఖీ చేశారు. ఈ తనిఖీలో, ప్రజారోగ్యానికి తీవ్ర ముప్పు కలిగించే విధంగా అత్యంత అపరిశుభ్రమైన, ప్రమాదకరమైన పరిస్థితుల్లో అల్లం పేస్ట్‌‌తోపాటు పెద్ద ఎత్తున ఆహార పదార్థాలను తయారు చేయడం, నిల్వ చేయడం జరుగుతున్నట్టు గుర్తించారు. పాడైపోయిన, ప్రమాదకరమైన వంట నూనెను పదే పదే ఉపయోగించారు. ఎలాంటి లైసెన్స్‌ ‌లేకుండానే నిషేధించిన ఏంఎస్‌‌కే లయన్‌ ‌గ్రీన్‌ ‌రాస్స్‌‌బెర్రీ రెడ్‌ ను ఉపయోగించారు. సులువుగా డబ్బులు సంపాదించాలని కల్తీ అహార పదార్థాలను వినియోగదారులకు సరఫరా చేస్తున్నారు. ఇలాంటి కల్తీ, అపరిశుభ్రమైన ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని డీసీపీ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -