Thursday, February 19, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్చండూరు హైస్కూల్ కు సౌండ్ సిస్టం వితరణ

చండూరు హైస్కూల్ కు సౌండ్ సిస్టం వితరణ

- Advertisement -

నవతెలంగాణ – చండూరు
ఆర్బిఆర్ ఫామ్స్ విలేజ్ నాటు కోళ్ల  కంపెనీ యజమాని, కురంపల్లి వాస్తవ్యులు నంద్యాల పురుషోత్తం రెడ్డి చండూరు ఉన్నత పాఠశాలకు రూ.20వేల విలువ చేసే మూవబుల్ సౌండ్ సిస్టంను గురువారం బహుకరించారు. ఈ సందర్భంగా పురుషోత్తం రెడ్డిని పాఠశాల తరపున శాలువా, మెమెంటోతో సత్కరించారు. తనకు విద్యాబుద్ధులు నేర్పిన గురువు బొమ్మరబోయిన చందు ప్రోత్సాహంతో ఈ బహుమానం అందజేస్తున్నట్లు, పాఠశాలకు తన వంతు సహకారం ఎల్లవేళలా ఉంటుందని  చెప్పారు. ప్రధానోపాధ్యాయులు ఏ  కోటీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. గతంలో వీరు 10వ తరగతి విద్యార్థులకు పదివేల రూపాయలను అందించారని గుర్తు చేశారు. ఇకముందు కూడా  పేదవిద్యార్థుల సంక్షేమం కోసం సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -