Thursday, February 19, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పంట రక్షణకు చర్యలు తీసుకోవాలి

పంట రక్షణకు చర్యలు తీసుకోవాలి

- Advertisement -

ఏరువాక కేంద్రం జిల్లా ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ శ్రీలత.. 
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 

పంట రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని యాదాద్రి భువనగిరి జిల్లా ( ఏరువాక కేంద్రం ) ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ శ్రీలత అన్నారు. గురువారం పంటను పరిశీలించి మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని పలు గ్రామాల్లోని వరి నేలల్లో పంట గిడసబారి,ఎరుపు వర్ణం లోకి మారడం, వరి పంట ఎదగక పోవడం గమనించడం జరిగిందని, దీనికి గల ముఖ్య కారణం సల్ఫైడ్ దుష్ప్రభావం, చౌడు వలన సంభవించును. ఈటువంటి ప్రాంతములో ,మట్టి మెత్తగా ఉండి ,కాలు చాలా లోతుగ దిగబడిపోవును.పొలంలో నడుస్తుంటే బుడగల రూపంలో గాలి బయటకు వస్తుంది.

నేల నుంచి దుర్గంద పు వాసన, మొక్కను వేర్లతో బయటకు తీసినపుడు కుళ్ళిన కోడి గుడ్ల వాసన వచ్చును .పంట వేర్లు పూర్తిగా నల్లబడి జీవములేక నేల నుండి పోషకాలను తీసుకునే సామర్ధ్యము తగ్గి మొక్కలు పూర్తిగా చనిపోయే ఆస్కారమున్నది.

దీని నివారణకు రైతులు ముఖ్యంగా చేపట్టవలసిన రైతులు పొలంలో ఈ దుష్ప్రభావాన్ని గమనించినప్పుడు మురుగు నీటిని తీసి మళ్ళీ నీరు అందివ్వాలి  పొలాన్ని సన్న నేర్రెలు వచ్చే వరకు ఆరబెట్టి అప్పుడప్పుడు మళ్ళీ నీరివ్వాలి . అమ్మోనియం సల్ఫేట్   వంటి ఎరువులను ఇలాంటి పొలాల్లో వాడరాదు.

ఇక ముందు ఈలాంటి భూముల్లో దీని దుష్ప్రభావం నివారణకు పైరు వేయటానికి మడిని తయారుచేయుటకు ముందు ఇటువంటి ప్రాంతాములలో  1-2 బండ్ల ఎర్రమట్టిని వేసి బాగా కలియబెట్టి ఆరబెట్టడం ,భూమిని ఎత్తుచేయటం చేయాలి,బరువు నేలల్లో సల్ఫర్ కలిగిన 20-20-0-15 లాంటి కాంప్లెక్స్ ఎరువుల వినియోగం తగ్గించాలని కోరారు. లోతుగా దమ్ము చేయడం తగ్గించాలని కోరారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -