నవతెలంగాణ – అశ్వారావుపేట
మండలంలోని మామిళ్ళవారిగూడెంలో గురువారం నిర్వహించిన శ్రీ మల్లేశ్వర స్వామి తీర్థ మహోత్సవములలో మాజీ ఎమ్మెల్యే, బీ ఆర్ఎస్ నియోజకవర్గం ఇంచార్జ్ మెచ్చా నాగేశ్వరరావు పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా మెచ్చా ను ఆలయ కమిటీ శాలువాతో సత్కరించారు.గుడిలో ఆయన అందరితో మాట్లాడుత కొద్ది సేపు గడిపారు. అనంతరం నందిపాడులో గొంది మంగరాజు – అలివేణి దంపతుల కుమార్తె రోహితశ్రీ పుష్పాలంకరణ వేడుకలో పాల్గొని చిన్నారిని ఆశీర్వదించారు.
ఈ కార్యక్రమంలో ఆయన వెంట మండల అధ్యక్షులు జజ్జూరి వెంకన్నబాబు, నాయకులు తాండ్ర యుగంధర్,చెన్నారావు,మిండ శ్రీనివాస్ రావు,ఉన్నం బాబురావు,కూరపాటి నరేష్,పుల్లారావు,సత్యనారాయణ,యాసం శ్రీనివాస్ రావు,మడకం శ్రీకళ, మోటూరి చిలకరావు,కాటూరి రాంబాబు,తాటి వెంకప్ప,సిద్ధుల ప్రవీణ్,నాగ మహేశ్వరరావు,సాగర్, తుంపాటి రమేష్,అరుణ్ కుమార్ తదితరులు ఉన్నారు.



