– రాష్ట్ర స్థాయి ప్రధమ బహుమతి సాధించిన అశ్వారావుపేట విద్యార్ధి
– ప్రతిభకు ఏ వైకల్యం అడ్డు కాదు
– ఎంఈఓ ‘పొన్నగంటి’
నవతెలంగాణ – అశ్వారావుపేట
కృషి, పట్టుదల ఉండాలే కానీ ప్రతిభకు ఏ వైకల్యం అడ్డు రాదని,కాదని విద్యాశాఖ మండల అధికారి పొన్నగంటి ప్రసాదరావు అన్నారు. ఇటీవల హైదరాబాద్ దోమల్ గూడ లో రెండు రోజులు పాటు రోస్టర్ స్థాయిలో నిర్వహించిన పలు పోటీలలో అశ్వారావుపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు కు చెందిన ప్రత్యేక అవసరాల విద్యార్ధి కె.నాగ రంజిత్ రాష్ట్రస్థాయిలో నిర్వహించిన ఆటల పోటీలలో 50 మీటర్ల పరుగు పందెం పోటీలో ప్రధమ బహుమతిని సాధించాడు.
ఈ సందర్భంగా గురువారం పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పి.హరిత అద్యక్షతన అభినందన సభ ఏర్పాటు చేసారు.రంజిత్ కు ప్రధమ స్థానం లభించడం పట్ల మండల విద్యాధికారి పి.ప్రసాదరావు హర్షం వ్యక్తం చేశారు.రంజిత్ ను ప్రత్యేకంగా అభినందించారు. రంజిత్ అన్నిటిలోను ముందుండేందుకు కృషి చేస్తున్నాడని వైకల్యం దేనికీ అడ్డురాదని నిరూపిస్తున్నాడని అన్నారు. రాష్ట్రస్థాయిలో ప్రధమ స్థానంలో బహుమతి పొంది ఆదర్శంగా నిలిచాడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రత్యేక విద్య ఉపాధ్యాయుడు రాంమోహన్, ఇతర ఉపాధ్యాయులు ఐ.ఇ.ఆర్.పిలు పాల్గొన్నారు.



