Thursday, February 19, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విద్యారంగ, ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించాలి: టీచర్స్ జేఏసీ

విద్యారంగ, ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించాలి: టీచర్స్ జేఏసీ

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
జిల్లాలోని విద్యారంగ ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం టీచర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో  యాదాద్రి భువనగిరి జిల్లా స్టీరింగ్ కమిటీ ఆధ్వర్యంలో  జిల్లా కలెక్టర్ కి వివిధ సమస్యలపై వినతి పత్రం అందజేశారు. ముఖ్యంగా జిహెచ్ఎంసి పరిధి పెరిగినందున జిహెచ్ఎంసి పరిధి నుండి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయులకు 24 శాతం హెచ్ఆర్ఏ ఇవ్వాలని, భువనగిరి మున్సిపల్ పరిధి నుండి 8 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి కార్యాలయాలలో పనిచేస్తున్నా వారికి 13 శాతం హెచ్ఆర్ఏ ఇవ్వాలని అన్నారు.

కేజీబీవీ పాఠశాలలకు సరఫరా చేసే బియ్యాన్ని స్కూల్ పాయింట్ వరకు సరఫరా చేయాలని, ఫారిన్ సర్వీసులో ఉండి వారి పీరియడ్ పూర్తయిన వారిని వెంటనే రిలీవ్ చేయాలని కోరారు. వర్క్ అడ్జస్ట్మెంట్ పేరుతో చేసినటువంటి అక్రమ సర్దుబాటులను వెనక్కి తీసుకోవాలని, అపరిష్కృతంగా  ఉన్నటువంటి జిల్లాలోని విద్యారంగా ఉపాధ్యాయ సమస్యను పరిష్కరించాలని ప్రాతినిధ్యం చేయడం జరిగిందని తెలిపారు. 

జిల్లా విద్యాశాఖ అధికారి కి, జిల్లా ట్రెజరీ అధికారి కి, జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ కి వివిధ సమస్యలపై వేరువేరుగా వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో  టీజీఇ జెఎసి జిల్లా చైర్మన్ మందడి ఉపేందర్ రెడ్డి,  కో చైర్మన్ జగన్మోహన్ రెడ్డి, జిల్లా టీచర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ  స్టీరింగ్ కమిటీ సభ్యులు జి మధుసూదన్, వీరారెడ్డి, ముక్కెర్ల యాదయ్య, మెతుకు సైదులు,  మైలారం సత్తయ్య,  కె రమేష్, కే రవీందర్,  ఎం వెంకటరెడ్డి, ఐ వెంకటేశ్వర్లు, బోయ రాము, బి కిష్టయ్య,  సిహెచ్ లక్ష్మి, జంగయ్య లు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -