Sunday, June 21, 2026
E-PAPER
Homeకవితఏముంటాయి

ఏముంటాయి

- Advertisement -

కొన్ని పుస్తకాలు
పూర్తి కాని కవితలు
ఇంకా రాయని ఆలోచనలు
గొంతు తడిపే వాటర్‌ బాటిల్‌
కళ్ళు తడిసే అక్షరాలు
రెక్కలు తొడగని ఊహలు
ఇష్ట సఖి లాంటి కొన్ని పెన్స్‌
పిల్లల మనస్సుల్లా
కొన్ని తెల్ల కాగితాల పావురాలు
ఏముంటాయి అంతకు మించి
వేళ్ళకి తగిలే నెమలి కన్ను లాంటి
జ్ఞాపకాల దొంతరలు
ఇంకా ఆ ఆకుపచ్చని నా బ్యాగ్‌లో
విశ్వసాహిత్యంలో
నేను ఆవగింజను కూడా
కాదనే ఎరుక చేసే
వలస పక్షులు వాలే కొమ్మల్లా దాని
లోపలి పొరలు
నా చిన్న సంచీలో ఇంకా ఏముంటాయి
ఏమైనా తెస్తానా
అని జిప్‌ తెరిసి చూసే పిల్ల పావురం
కొత్త పెన్నులను ఖుషీగా
మాయం చేస్తుంది
ప్రయాణంలో నా బ్యాగ్‌ పోయినా
అది నన్ను వెతుక్కుంటూ
నా ఇంటికే వస్తుంది
రామ చిలుకలా
కాసులు దొరకని నా సంచి
కనకం అంటని నా సంచి
లోకులు ఎప్పటికీ అందుకోలేరు
అందుకే నా బ్యాగ్‌
ఎప్పటికీ మరచి పోని స్నేహితుడిలా
నా వెంటే ఉంటుంది
అక్షరాల బరువును మోసి
దాని హదయం బరువెక్కినా..
డా.సుంకర రమేశ్‌, 9492180764

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -