Sunday, August 16, 2026
E-PAPER
Homeకవితత్రివర్ణ శ్వాస గేయం

త్రివర్ణ శ్వాస గేయం

- Advertisement -

పల్లవి:
మూడు రంగుల జెండా…
మా గుండె నిండా…
నిండినది నీ రూపమే…
ఓ భారతమాతా…!
జై హింద్‌ నినాదమే…
మా ప్రతి శ్వాస…
జన్మభూమి సేవయే …
మాకున్న ఆశ…!
చరణం – 1
మహనీయుల అడుగులతో సాగిన చరిత్ర ఇది,
వీరుల త్యాగాలతో వెలిగిన దీపమిది.
బానిస సంకెళ్లను తెంచిన ధైర్యమిది,
స్వేచ్ఛయను సూర్యుడే తెచ్చిన వెలుగు ఇది.
చరణం – 2
ఈ నేలపై పుట్టడం మా పూర్వ పుణ్యము,
ఈ జెండా నీడలో బతకడమే భాగ్యము.
చివరి శ్వాస వరకూ జై హింద్‌ నినాదము
దేశభక్తి మార్గంలో సాగేటి పయనము
కోట్లాది గొంతుకల ఒకే ఒక గానము…
భరతమాత పాదాలకే మా నిండు ప్రణామము…!
– సాధన

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -