నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండలంలోని ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల్లో ఆదివారం అంతర్జాతీయ యోగా డే ను ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని శ్రీ విద్యాసాయి ఉన్నత పాఠశాలలో నిర్వహించిన యోగ దినోత్సవ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు సుమారు 500 మంది పాల్గొని ఆసనాలను వేశారు. కోన సమందర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు యోగ అక్షర క్రమంలో ఆసనాలను వేసి ఆకర్శించారు.
ఈ సందర్భంగా విద్యార్థులకు ఉపాధ్యాయులు యోగ వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. యోగ చేయడం వల్ల శారీరక, మానసిక వ్యాధులు దూరమవుతాయని తెలిపారు. మానవుడికి మానసిక ప్రశాంతత ఏర్పడుతుందని, అందువల్ల ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ఉదయం యోగా చేయడం ద్వారా ఆరోగ్యంగా జీవించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ విద్యా సాయి ఉన్నత పాఠశాల కరస్పాండెంట్ ఏనుగు గంగారెడ్డి, ప్రధానోపాధ్యాయులు మంద శ్రీనివాస్, అకాడమిక్ కో ఆర్డినేటర్ నవీన్, ఇంచార్జ్ పవన్ కుమార్, మర్యాల నాగభూషణం, ఉట్నూరు రాజశేఖర్, భోగ రామస్వామి, చింత ప్రవీణ్, నరేందర్, జొన్నల భూపతి, ఆడిచెర్ల రవీందర్, ఏసాల శ్రీనివాస్, గుండోజీ ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.



