Monday, June 22, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంమా గొంతు నొక్కేందుకు 
అధికార దుర్వినియోగం

మా గొంతు నొక్కేందుకు 
అధికార దుర్వినియోగం

- Advertisement -

మంత్రి వివేక్‌, హెచ్‌సీఏపై గురువారెడ్డి ధ్వజం
నవతెలంగాణ-హైదరాబాద్‌ : హెచ్‌సీఏలో ఏండ్లుగా చోటుచేసుకున్న సంస్థాగత అవినీతి, విశాఖ సంస్థకు అక్రమంగా తరలించిన నిధులు సహా గ్రామీణ క్రికెట్‌కు జరిగిన అన్యాయంపై పోరాడుతున్న తెలంగాణ క్రికెట్‌ అసోసియేషన్‌ (టీసీఏ) గొంతు నొక్కేందుకు మంత్రి వివేక్‌ వెంకటస్వామి, హెచ్‌సీఏ ఉన్నతాధికారులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని టీసీఏ ప్రధాన కార్యదర్శి ధరం గురువారెడ్డి ధ్వజమెత్తారు. అనుమతులు లేకుండా జరుగుతున్న టీజీ20 లీగ్ సహా హెచ్‌సీఏ అక్రమాలపై సిఐడి కేసుల నేపథ్యంలో టీసీఏ సికింద్రాబాద్‌లోని ఓ హోటల్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయగా.. మంత్రి అధికార దుర్వినియోగంతో హోటల్‌ యాజమాన్యానికి బెదిరించి అనుమతి నిరాకరించేలా చేశారాని గురువారెడ్డి ఆరోపించారు. హోటల్‌లో ప్రెస్‌ మీట్‌కు అనుమతి రద్దు చేయటంతో టీసీఏ ప్రతినిధులు చల్లా రామ్‌, గోపాల్‌ శర్మ, కపిలవాయి రవీందర్‌, ఝాన్సీ, వరుణ్‌ రెడ్డి, నవరసన్‌, పరుశురామ్‌ తదితరులతో కలిసి రోడ్డుపైనే గురువారెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘వివేక్‌ కుటుంబానికి చెందిన వ్యక్తులే హెచ్‌సీఏ నాలుగు పర్యాయాలు అధ్యక్ష పదవిలో కొనసాగారు. వారి హయాంలోనే అధికంగా అవినీతి చోటుచేసుకుంది. వివేక్‌కు చెందిన విశాఖ సంస్థకు అడ్డదారిలో నిధులు మళ్లించారు. ఈ అంశంపై విచారణ జరిపించాలని డిమాండ్‌ చేస్తున్నాం. అనుముతులు లేకుండా టీజీ20 లీగ్‌ నిర్వహిస్తున్నారు. బీసీసీఐ అనుమతులు ఉంటే బహిర్గతం చేసేందుకు ఎందుకు వెనకాడుతున్నారు? అని గురువారెడ్డి ప్రశ్నించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -