Monday, June 22, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి 

విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి 

- Advertisement -

మండల వ్యవసాయ అధికారి భూక్య మహేందర్ 
నవతెలంగాణ-నెల్లికుదురు 

ఆలేరు, నెల్లికుదురు,చిన్న నాగరం రైతు వేదికల ద్వారా విత్తనాలు మేళ పంపిణీ  కార్యక్రమాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి భూక్య మహదర్ అన్నారు. సోమవారం మాట్లాడుతూ మండలంలోని రైతులకు నాణ్యమైన విత్తనాలు, పప్పుధాన్యాల విత్తనాలు మరియు ఆధునిక ఎరువుల వినియోగంపై అవగాహన కల్పించుటకు విత్తన మేళా (Seed Mela) ను 23-06-2026, మంగళవారం నుండి 30-06-2026 వరకు నిర్వహించబడుచున్నది అని తెలిపారు.ఈ విత్తన మేళాలో క్రింది వరి రకాల విత్తనాలు ప్రభుత్వం బోనస్ అమలు చేసేవి అందుబాటులో ఉండును ఉన్నాడు.

 BPT 5204, HMT సోనా, జై శ్రీరామ్ ,KNM 1638,  RNR 15048,  WGL 44 ,KNM 7715, వీటికి మాత్రమే బోనస్ వస్తుందని తెలిపారు.అదేవిధంగా వివిధ పప్పుధాన్యాల , అప్పరాలు,కురయగాలు విత్తనాలు, నానో యూరియా, నానో డీఏపీ (DAP) తదితర వ్యవసాయ ఉత్పత్తులు కూడా రైతులకు అందుబాటులో ఉన్నాయని అన్నాడు.ప్రజా ప్రతినిధులు మరియు వ్యవసాయ శాఖ అధికారుల సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించబడును. కావున రైతు సోదరులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని విత్తన మేళాకు హాజరై అవసరమైన విత్తనాలు మరియు వ్యవసాయ ఉత్పత్తులను పొందగలరని కోరడమైనది అని ఆయన తెలిపాడు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -