Tuesday, June 23, 2026
E-PAPER
Homeజాతీయంభారత్‌ బ్రాండ్ కు బీటలు

భారత్‌ బ్రాండ్ కు బీటలు

- Advertisement -

విదేశాల్లో ఇండియన్‌ అంటే
అనుమానపు చూపేనా?
కొద్దిమంది భారతీయుల
ప్రవర్తనతో దేశ పత్రిష్టకు మచ్చ
నవ తరాన్ని వెంటాడుతున్న కొత్త భయం
ప్రపంచంలో భారతీయుల విదేశీ ప్రయాణాలు రికార్డులు సృష్టిస్తున్నాయి. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పర్యాటకం.. ఇలా ఏదో ఒక పని నిమిత్తం ప్రపంచ దేశాలు తిరుగుతున్న భారతీయుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. అయితే ఆయా దేశాల్లో కొందరు భారతీయుల నిర్లక్ష్య ప్రవర్తన ప్రపంచ వేదికపై దేశ ప్రతిష్టను దెబ్బ తీస్తోంది. ఇప్పుడు ఈ భయమే విదేశాలకు వెళ్లాలనుకుంటున్న భారతీయులను వెంటాడుతున్నది. లక్షలాది మందిని ఆందోళనకు గురి చేస్తోంది.

న్యూఢిల్లీ : పాస్‌పోర్టు అంటే విదేశీ ప్రయాణాల కలలకు తొలి మెట్టు. అయితే చాలా మంది భారతీయులకు ఆ పాస్‌పోర్టు చేతికి వచ్చిన ఆనందం కంటే ఆందోళననే ఎక్కువగా కనిపిస్తోంది. విదేశాల్లో కొందరి భారతీయుల ప్రవర్తనే ఇందుకు కారణమవుతోంది. దీంతో కేవలం ‘భారతీయులు’ అనే ట్యాగ్‌ కారణంతోనే.. తాము విదేశాల్లో అనేక అనుమానాలు, అవమానాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయని కొందరు తమ అనుభవాలను వ్యక్తం చేస్తున్నారు.
వీడియోలతో ప్రపంచానికి చేరుతున్న చెడు సందేశం
ఇటీవలి కాలంలో భారతీయ పర్యాటకుల ప్రవర్తనకు సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. వియత్నాం విమానాశ్రయం రన్‌వేపై గర్భా నృత్యాలు చేయడం, హనోరులోని ప్రసిద్ధ ట్రైన్‌ స్ట్రీట్‌లో ప్రమాదకరంగా డ్యాన్స్‌లు చేయడం, జపాన్‌లో షాపుల నుంచి వస్తువులు దొంగిలించిన ఘటనలు, హౌటళ్లలోని షాంపూ బాటిళ్లను ఇంటికి తీసుకెళ్లడం వంటి చర్యలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాం శమయ్యాయి. ఇవి కేవలం వినోదాత్మక ఘటనలుగా కనిపించినప్పటికీ.. అంతర్జాతీ యంగా భారతీయుల ప్రతిష్టపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని విశ్లేషకులు చెప్తున్నారు.
‘అందరూ ఒకటే’ అనే ముద్ర
బాలి రిసార్ట్‌లో వస్తువుల దొంగతనం ఆరోపణలు ఎదుర్కొన్న భారతీయ పర్యాటకుల ఘటన, ఇండియన్‌ టూరిస్టుల కోసం ప్రత్యేక నిబంధనలు అమలు చేస్తున్నట్టు ప్రచారంలోకి వచ్చిన స్విట్జర్లాండ్‌ హౌటల్‌ ఉదాహరణలను విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు.
ఇలాంటి ఘటనలతో కొద్ది మంది చేసిన తప్పులకు మొత్తం భారతీయ సమాజం మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
విదేశాల్లో చేదు అనుభవాలు
వియత్నాం వెళ్లిన తన సహౌద్యోగి అనుభవానికి ఓ మహిళ వివరించారు. భారతీయులమని తెలిసిన వెంటనే కొంత మంది దుకాణ యజమానుల ప్రవర్తన మారి పోయిందనీ, మర్యాద తగ్గిందని పేర్కొన్నారు. భారతీయులు ప్రపంచంలోనే వేగంగా పెరుగు తున్న విదేశీ పర్యాటక వర్గాల్లో ఒకరైనప్పటికీ.. కొన్ని దేశాల్లో వారిపై సానుకూల భావన తగ్గుతోందన్న అభిప్రాయాన్ని విశ్లేషకులు చెప్తున్నారు.

ముస్లింను పాకిస్తాన్‌కు వెళ్లాలన్న భారత సంతతి మహిళ
యూకేలోని ఒక రైలులో జరిగిన ఘటన తీవ్ర చర్చనీయాంశమైంది. బ్రిటన్‌లో నివసిస్తున్న గుజరాతీ మూలాలున్న బ్రిటీశ్‌ పౌరురాలు ఉషా పటేల్‌.. రైలులో ప్రయాణిస్తున్న సమయంలో ఆమె మరో ప్రయాణికుడిని ఉద్దేశించి జాత్యహంకార, విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారు. ‘గో టూ పాకిస్తాన్‌’ (‘పాకిస్తాన్‌కు వెళ్లిపో’) అంటూ అవమానకరంగా మాట్లాడిన వీడియో సోషల్‌ మీడియాలో వైరలైంది. అయితే ఆమె టార్గెట్‌ చేసిన ఆ వ్యక్తి ముస్లిం మతానికి చెందిన ఒక వైద్యుడు. ఆ వైద్యుడు జరిగిన సంఘటనను తన మొబైల్‌ ఫోన్‌లో రికార్డు చేసి సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ వీడియో, ఫిర్యాదు ఆధారంగా బ్రిటీశ్‌ పోలీసులు విచారణ చేపట్టారు. అనంతరం ఉషా పటేల్‌ను రైలు నుంచి దింపి అదుపులోకి తీసుకున్నారు. ఆమెపై విద్వేషపూరిత ప్రవర్తన, జాత్యహం కార వ్యాఖ్యలు చేసినందుకు చట్టపరమైన చర్యలు మొదలు పెట్టారు. విచారణ అనం తరం ఆమె న్యాయపరమైన శిక్షలు ఎదు ర్కొన్నారనీ, ఆమెను యూకే నుంచి భారత్‌ కు పంపించినట్టు కథనాలు వెలువడ్డాయి.

ఆత్మ పరిశీలన అవసరం
కొందరు భారతీయులు విదేశాల్లో అక్కడి నియమాలు పట్టించుకోకుండా ప్రవర్తిస్తు న్నారు. దీంతో స్వదేశంలో కనిపించే ఆత్మ విశ్వాసం విదేశాల్లో అహంకారంగా కనిపించే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరి స్తున్నారు. ప్రజలు ఉండే బహిరంగ ప్రదేశాల నూ వ్యక్తిగత వేదికలుగా మార్చడం, స్థానిక సంస్కృతిని గౌరవించకపోవడం, ఇతర దేశాల నియమాలను తేలికగా తీసుకోవడం వంటి ధోరణులు భారతీయులపై ప్రతికూల ప్రభ వాన్ని పెంచుతున్నాయని విశ్లేషకులు అభి ప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం, భారతీయులు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అంటున్నారు.

కొత్త తరానికి భయాలు
మొదటిసారి విదేశాలకు వెళ్లబోతున్న తమను.. విమానాశ్రయంలో తమను ఎలా చూస్తారు? దుకాణాల్లో తమతో ఎలా ప్రవర్తిస్తారు? అనే ఆలోచనలు కొత్త తరం భారతీయులను వెంటాడుతున్నాయి. ఇలాంటి భయాలు వారిని వారు విదేశాలకు వెళ్లి నెరవేర్చాల్సిన లక్ష్యాలపై దృష్టి పెట్టకుండా చేస్తాయని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో భారతీ యులు విదేశాల్లో ఎలా ప్రవర్తిస్తు న్నారనే అంశంపై నిజాయితీగా చర్చ జర గాలని వారు సూచిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -