నవతెలంగాణ – కామారెడ్డి : కామారెడ్డి పట్టణంలో బీజేపీ కార్యాలయం వద్ద శనివారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన రామారెడ్డి మండలం పోసానిపేట గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ గీరెడ్డి మహేందర్ స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి కారులో చేరుకుని నినాదాలు చేయడంతో ఉద్రిక్తత చెలరేగింది. “డౌన్ డౌన్” అంటూ నినాదాలు చేయడంతో అక్కడున్న బీజేపీ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
పరిస్థితి విషమించడంతో పోలీసులు వెంటనే జోక్యం చేసుకుని గీరెడ్డి మహేందర్ రెడ్డినీ అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా క్యాంప్ కార్యాలయం ముందు నిలిపిన ఆయన కారును కొంతమంది బీజేపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు.
ఈ ఘటనలో పోలీసులు తగిన విధంగా స్పందించలేదని బీజేపీ నాయకులు ఆరోపించారు. కారుని పండించిన బిజెపి కార్యకర్తను అరెస్టు చేసిన వ్యక్తిని పోలీసులు కొడుతున్నారంటూ బిజెపి నాయకులు కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బిజెపి కార్యాలయం వద్ద పోలీస్ బందోబస్తు ఉన్నప్పటికీ ఇటువంటి ఘటన జరగడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న జిల్లా ఎఎస్పీ చైతన్య రెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
బీజేపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. అరెస్టుపై ఆగ్రహం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



