నవతెలంగాణ-బీర్కూర్ (నసురుల్లాబాద్)
బీర్కూర్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన ఉచిత నేత్ర పరీక్షా శిబిరానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. జూలై 1, 2025 నుండి నేటి వరకు క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన 300వ సేవా కార్యక్రమంగా ఈ శిబిరాన్ని నిర్వహించారు. కంటి వైద్య సహాయకులు సతీష్ ఆధ్వర్యంలో మొత్తం 43 మందికి ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించారు. పరీక్షల అనంతరం కంటి శస్త్రచికిత్స అవసరమైన 16 మంది రోగులను బోధన్ లయన్స్ కంటి ఆసుపత్రికి రిఫర్ చేశారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో లయన్స్ క్లబ్ నిరంతరం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందని క్లబ్ అధ్యక్షుడు సీతలె రమేష్ తెలిపారు. ఉచిత వైద్య శిబిరాలు ప్రజలకు ఎంతో ఉపయోగపడుతున్నాయని గ్రామస్థులు అభినందించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు సీతలె రమేష్, సీనియర్ సభ్యులు మేకల విఠల్, ఎం.ఏ. రషీద్, కంటి వైద్య సహాయకులు సతీష్ తదితరులు పాల్గొన్నారు.
కంటి వైద్య శిబిరానికి అనూహ్య స్పందన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



