- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని కొయ్యుర్ గ్రామంలో ఉన్న విశ్వదీప్తి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో చిన్నారులు ఆడుకోవడానికి చిల్డ్రన్ పార్క్ ఏర్పాటు చేసినట్లుగా పాఠశాల కరస్పాండెంట్ సుదర్శనన్ తెలిపారు. సోమవారం గ్రామ సర్పంచ్ కొండ రాజమ్మ,ఉప సర్పంచ్ లకావత్ సవేందర్, పేరెంట్స్ కమిటీ అధ్యక్షుడు సంతోష్ ప్రారంభించారు. తమ పాఠశాల విద్యార్థులే కాకుండా బయటి చిన్నారులు సైతం చిల్డ్రన్ పార్కులో ఆటలు ఆటలు అడుకోవచ్చని పాఠశాల వైస్ ప్రిన్స్ పాల్ మేరీ వార్గీస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
- Advertisement -



