నవతెలంగాణ – మల్హర్ రావు
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ వెన్నెల పిలుపునిచ్చారు. కాటారం మండలం గంగారంలో జరిగిన టి.ఎస్.ఎస్ కళాకారిణి జాడి సుమలత వివాహ వేడుకలో ఆమె హాజరై మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ప్రతి పౌరుడికి ఎంతో విలువైనదని, ప్రతి ఒక్కరూ తమ పేరును ఓటరు జాబితాలో నమోదు చేసుకొని, ఎన్నికల సమయంలో తప్పకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. అలాగే, యువత ప్రత్యేకంగా ముందుకు వచ్చి ఓటర్ నమోదు ప్రక్రియలో పాల్గొనాలని, తమ కుటుంబ సభ్యులు, పరిచయస్తులకు కూడా అవగాహన కల్పించాలని తెలిపారు. ప్రజాస్వామ్య బలోపేతానికి ప్రతి ఓటు ఎంతో కీలకమని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కళాకారులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
ఎస్ఐఆర్ లో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



