నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
టీఎస్‌పీఎస్సీ ఆదివారం నిర్వహించిన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్స్ (సివిల్ ఇంజినీరింగ్) ఆన్‌లైన్ నియామక పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. 1,180 ఖాళీల భర్తీ కోసం నిర్వహించిన ఈ పరీక్షల్లో పేపర్ వన్‌కు 13,405 (60.44 శాతం), 13,343 (60.17 శాతం) మంది హాజరయినట్టు టీఎస్ పీఎస్సీ డిప్యూటీ సెక్రెటరీ ఒక ప్రకటనలో తెలిపారు.