ఉన్నతాధికారులకు పిర్యాదు చెసిన చర్యలు శూన్యం
ప్రజా సంఘాల నాయకురాలు పులిగంటి సుప్రియ ఆరోపణ
నవతెలంగాణ – మల్హర్ రావు
భూపాలపల్లి జిల్లాలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆసంక్షేమానికి అడ్డాగా మారిందని,ఈ ఘటనపై పలుమార్లు ఉన్నతాధికారులకు పిర్యాదు చెసిన పట్టించుకోవడం లేదని ప్రజా సంఘాల నాయకురాలు పులిగంటి సుప్రియ ఆరోపించారు.శుక్రవారం మండల కేంద్రమైన తాడిచెర్లలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు బాలరక్ష భవన్ లో పనిచేస్తున్న డిసిపీయు,ఇతర సిబ్బంది గతంలో సమర్పించిన నకిలీ ధ్రువపత్రాల పైన వచ్చిన ఆరోపణలతో గత జిల్లా కలెక్టర్ ఆదేశాలతో అప్పటి డి.డబ్ల్యూఓ విచారణ చేయించి ప్రభుత్వానికి నివేదిక పంపిన విషయాన్ని తెలిపారు.ఇట్టి విషయంపైన గతంలో పని చేసిన ఇద్దరు డి.డబ్ల్యూ.ఓలు ఆ నకిలీ ధృవపత్రాలు పెట్టిన వారికి కాంట్రాక్ట్ రెనివల్ ఆపి వారిని కార్యాలయ విధులకు దూరంగా ఉంచగా,ప్రస్తుత ఇంచార్జ్ అధికారి మాత్రం అందుకు భిన్నంగా దూరం పెట్టిన వారితో సంబంధిత కార్యాలయ పనులు చేయించడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
పాత డిడబ్ల్యూఓ లు అలాంటి సిబ్బందికి, కార్యాలయానికి ఎలాంటి సంబంధం లేదని సాక్షాత్తు సమాచార హక్కు చట్టం, 2005 ద్వారా సమాచారం ఇచ్చిన విషయాన్ని బట్టబయలు చెసినట్లుగా తెలిపారు.కొన్ని నెలల నుండి నకిలీ ధృవ పత్రాలు పెట్టిన వారిని పనికి దూరంగా పెట్టిన అధికారి,నిన్న గాక మొన్న మహాదేవపూర్ లో బాల్య వివాహం జరుగుతున్నదన్న వార్త తెల్సి,ఇట్టి నకిలీలలో ఒకరిని అట్టి బాల్య వివాహ నిర్మూలన విధులకి పంపడం ఒకింత విడ్డూరంగా ఉందన్నారు.ఇంతచేసి, అక్కడ బాల్య వివాహం జరుగుతున్నదా అంటే అదీ లేదని,అయితే అక్కడ ఈ యొక్క అనధికార సిబ్బంది తమ అత్యుత్సాహాన్ని ప్రదర్శించి వివరాలను, సాక్షాలను సేకరించకుండానే మొదట హల్చల్ సృష్టించినా, తర్వాత అమ్మాయికి 18 సంవత్సరాలు నిండాయని తెలుసుకొని నాలుక కరుచుకున్నారని ఆరోపించారు.ఇలాంటి అనుభవం లేని వారికి విధులు అప్పజెప్తడంపై అమ్మాయి తల్లిదండ్రులు తిరిగి వీరి పై కేసు పెడితే సంబంధిత శాఖ పరువు పోతుందని హెచ్చరించారు.ఇలాంటి దుశ్చర్యపై వెంటనే విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
గత కొన్ని నెలలుగా కార్యాలయ పనులకు దూరంగా ఉన్న వారికి కాంట్రాక్ట్ సమయం ముగిసిన వారికి వేతనాలు ఇవ్వడం అంటే ప్రజాధనాన్ని వృధా చేయడం కాదని ప్రశ్నించారు.బాల రక్షా భవన్ లోని సిబ్బందిపైన గతంలో విజిలెన్స్ విచారణలో కొంతమంది దోషులని కూడా నివేదిక వచ్చిన ఇంతవరకు వారిపై ఎలాంటి చర్యలు తీసుకోక పోవడం శోచనీయమన్నారు.సంబంధిత శాఖ అధికారి దోషులతో కుమ్మకైనట్లుగా ఆరోపించారు.29 మంది పైన విచారణ కొనసాగగా 7గురికి వేతనాలు ఇవ్వడం అంటే మిగతావారు నకిలీలని అర్థమైయిందన్నారు.ఈ మాత్రం విషయ పరిజ్ఞానం లేకుండా అలాంటి వారికీ తిరిగి బాధ్యతలు చెప్పడం కంచె చేను మేయడం లాంటిదని వాపోయారు.ఇప్పటివరకు వీరికి ఎలాంటి జీతభత్యాలు,కాంట్రాక్టు రెన్యూవల్ లేదని,ఏలాంటి జీతాలు లేనటువంటి ఈ సిబ్బందిని విధుల్లోకి పంపిస్తే అధికారాన్ని అడ్డం పెట్టుకొని కింది స్థాయిలో వసూళ్ళ పర్వానికి తెరలేపే అవకాశం ఉంటుందన్నారు.ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారి రక్షా భవన్ లో అక్రమంగా విధులు నిర్వహిస్తున్న నకిలీల పై వెంటనే తగిన చర్యలు తీసుకొని చట్టపరంగా శిక్షించి, ప్రజా ధనాన్ని వృధా కాకుండా చూడాలని కోరారు.



