Friday, June 26, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సుజుకి సుంచు చారిటబుల్ ట్రస్టు సేవలు మరింత విస్తరించాలి

సుజుకి సుంచు చారిటబుల్ ట్రస్టు సేవలు మరింత విస్తరించాలి

- Advertisement -

చిమ్మయ్య విద్య పీఠం కేరళ డిఎన్ డాక్టర్ గ్లోరీ స్వరూప పిలుపు
నవతెలంగాణ-ఆలేరు రూరల్ 

సుజుకి సుంచు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు ఉచిత విద్యతోపాటు భోజన, ఇతర సదుపాయాలను అందించడం అభినందనీయమని చిమ్మయ్య విద్య పీఠం కేరళ డిన్ డాక్టర్ గ్లోరీ స్వరూప అన్నారు.శుక్రవారం నాడు ఆలేరు మండలంలోని మందనపల్లి గ్రామంలో సుజుకి సుంచు చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నేడు పేద విద్యార్థులు చదువుకోలేక అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

తల్లిదండ్రులను కోల్పోయిన విద్యార్థులను ఉన్నత స్థాయికి తీసుకువెళ్లేందుకు సుజుకి సుంచు చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు పేద విద్యార్థులకు తమ సంస్థ ద్వారా సౌకర్యాలు అందించేందుకు ముందుకు రావడం అభినందనీయమని అన్నారు. సుజుకి సుంచు చారిటబుల్ ట్రస్టు సేవలను మరింత విస్తరించి,భవిష్యత్తులో పేద విద్యార్థులకు మెరుగైన విద్యను అందించి, ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్లాలని సూచించారు. ప్రపంచంలో ఎన్నటికీ తరిగిపోనిది విద్య మాత్రమేనని అన్నారు.అలాంటి విద్యను క్షేత్రస్థాయిలో బలోపేతం చేస్తూ,గ్రామీణ విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తును అందించేందుకు తమ వంతు సహాయ సహకారాలు సుజుకి సుంచు చారిటబుల్ ట్రస్ట్ కు నిరంతరం ఉంటాయని హామీ ఇచ్చారు.సుజుకి సుంచు చారిటబుల్ ట్రస్టు సేవలను ఆలేరు ప్రాంత విద్యార్థులు సద్వినియోగం చేసుకొని తమ ఉజ్వల భవిష్యత్తు కోసం పునాదులు వేసుకోవాలని పిలుపునిచ్చారు. 

అనంతరం సుజుకి సుంచు చారిటబుల్ ట్రస్టు నిర్వాహకులు సుంచు దేవదాసు మాట్లాడుతూ ఆలేరు ప్రాంతంలో విద్య విద్యారంగం బలోపేతం కోసం తమ వంతు కృషి చేస్తున్నామని అన్నారు.తల్లిదండ్రులను కోల్పోయిన విద్యార్థులకు తమ సంస్థ ద్వారా మానసిక ధైర్యాన్ని నింపి, సమాజంలో తలెత్తుకుని జీవించేందుకు తమ వంతు కృషి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని వివరించారు.తమ సంస్థ ఆధ్వర్యంలో వయోజన విద్య (రాత్రి బడి),గ్రామాలలోని యువతి యువకులలో గల నైపుణ్యాన్ని వెలికితీస్తూ,వృత్తి విద్య శిక్షణ తరగతులను నిర్వహిస్తామని అన్నారు.గ్రామాలలోని రైతులు సహజ ఎరువుల ద్వారా పంటలను పండించేందుకు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తాము అని చెప్పారు.

తమ సంస్థ ఆధ్వర్యంలో శిక్షణ పొందిన యువతి యువకులకు స్వయం ఉపాధి రంగాలలో అభివృద్ధి చెందేందుకు తోడ్పాటు అందిస్తామని హామీ ఇచ్చారు. సుజుకి సుంచు చారిటబుల్ ట్రస్టు సేవలను బలోపేతం చేసేందుకు సుజుకి సుంచు చారిటబుల్ ట్రస్టు సేవలను విస్తరిస్తామని అన్నారు.ఉచిత వసతి గృహాన్ని ఏర్పాటుచేసి తమ సేవలను మరింత విస్తరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.ఈ వసతి గృహంలోని విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు ఆలేరు పట్టణంలోని ప్రముఖ విద్యాసంస్థలలో తమ సంస్థ ద్వారా చేర్పించి,వారి భవిష్యత్తు కోసం ఇప్పటికే చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఆలేరు ప్రాంతంలోని పేద విద్యార్థులకు తమ సంస్థ ఆధ్వర్యంలో ఉజ్వల భవిష్యత్తును అందించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించి, అమలు చేసేందుకు ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్ని చర్యలు తీసుకుంటామని వివరించారు.

 ఆ తర్వాత గ్రామ సర్పంచ్ చిరుమర్తి రేణుక నరసయ్య మాట్లాడుతూ తమ గ్రామంలో ఇలాంటి సేవా కార్యక్రమాలను అమలు చేసేందుకు ముందుకు వచ్చిన సుజుకి సుంచు చారిటబుల్ ట్రస్టు నిర్వాహకులను అభినందించారు. సుజుకి సుంచు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చేపట్టే కార్యక్రమాలకు గ్రామపంచాయతీ పాలకవర్గం తరఫున నిరంతరం సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ పద్మ శశిరేఖ సుదర్శన్,మాజీ సర్పంచ్ కోటగిరి పాండరి, గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు కడకంచి శ్రీలత కృష్ణ, తమ్మడి అంజయ్య, సుంచు ఇందిర రామ్, కడకంచి రాజు,ఊట్కూరి అంజయ్య,కుర్రి సాయికుమార్,ఇన్ఫోసిటీ కంపెనీ ఎండి గోపు సాగర్ రెడ్డి,హైదరాబాద్ స్వరూప మెడికల్ సేవల ఎండి ఆర్ సునీల్ డేవిడ్, పీస్ యూనివర్సిటీ డైరెక్టర్ వై యేసురత్నం, ఎవరెస్టు ఉన్నత పాఠశాల డైరెక్టర్ మిట్టపల్లి విజయ్ కుమార్,విశ్రాంత వ్యవసాయ శాఖ అధికారి ఎస్ ఐసయ్య, సుజుకి చారిటబుల్ ట్రస్టు సభ్యులు, విద్యార్థుల సంరక్షకులు, గ్రామ ప్రజలు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -