Friday, June 26, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పెండింగ్ స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలి

పెండింగ్ స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలి

- Advertisement -

నవతెలంగాణ – ఉప్పునుంతల
ఉప్పునుంతల మండలంలోని కంసానిపల్లి గ్రామంలో భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్‌ఎఫ్‌ఐ) ఆధ్వర్యంలో విద్యార్థుల సమావేశం నిర్వహించి గ్రామ నూతన కమిటీని ఏర్పాటు చేసినట్లు గ్రామ అధ్యక్షుడు కలమండల లక్ష్మణ్, కార్యదర్శి వెలుటూరి సతీష్ తెలిపారు.

ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎస్‌ఎఫ్‌ఐ మాజీ జిల్లా అధ్యక్షుడు చింతల నాగరాజు మాట్లాడుతూ, విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు ఉద్యమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ పాఠశాలల కుదింపు నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని, విద్యా రంగానికి బడ్జెట్‌లో 20 శాతం నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వ పాఠశాలలను ఆదర్శ విద్యాలయాలుగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకోవాలని, పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు. బకాయిలు విడుదల కాకపోవడంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం నూతన గ్రామ కమిటీ చురుకుగా పనిచేయాలని సూచించారు.

ఈ సందర్భంగా గ్రామ ఉపాధ్యక్షులుగా కలమండల ప్రశాంత్, వెలుటూరి ఆంజనేయులు, సహాయ కార్యదర్శులుగా కే. ఉదయ్, చరణ్, గర్ల్స్ కన్వీనర్‌గా శ్యామల, కమిటీ సభ్యులుగా లక్ష్మణ్, స్వామి, శివ, గణేష్‌లను ఎన్నుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -