Friday, June 26, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్తాడిచర్ల ఓపెన్ కాస్ట్ లో డ్రైవర్లకు అవగాహన

తాడిచర్ల ఓపెన్ కాస్ట్ లో డ్రైవర్లకు అవగాహన

- Advertisement -

కాటారం డిఎస్పి సూర్యనారాయ
నవతెలంగాణ – మల్హర్ రావు

భూపాలపల్లి జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త ఐపీఎస్ ఆదేశాల మేరకు శుక్రవారం మండల కేంద్రమైన తాడిచెర్ల లోని ఓపెన్ కాస్ట్ గనిలో పనిచేసే డ్రైవర్లకు కాటారం డిఎస్పి సూర్యనారాయణ, కొయ్యూరు ఎస్ఐ మహేందర్ కుమార్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. డిఎస్పి మాట్లాడుతూ డ్రైవర్లు క్రమశిక్షణతో మెలగాలని,మద్యం తాగి వాహనాలు నడపద్దని, గంజాయికి డ్రగ్స్ కి దూరంగా ఉండాలని, ఎటువంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు వహించాలని సూచించారు. మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేసి, శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -