- Advertisement -
నవతెలంగాణ-మద్నూర్
మండల పరిధిలోని మేనూర్ గ్రామంలో ఆదివారం ఉదయం పల్స్ పోలియో చుక్కల కార్యక్రమాన్ని ఆ గ్రామ సర్పంచ్ అశోక్ పటేల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఐదు సంవత్సరాలలోపు గల పిల్లలందరికీ పల్స్ పోలియో చుక్కలు తప్పక వేయించాలని అన్నారు. పోలియో చుక్కల కార్యక్రమం విజయవంతం కావడానికి ఆరోగ్యశాఖ సిబ్బంది, అంగన్వాడి టీచర్లు, ఆశా వర్కర్లు, అందించే సేవలు అమూల్యమైనవి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆ గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జుబ్రి సురేష్, ఏఎన్ఎంలు, అంగన్వాడీ టీచర్లు, ఆశ వర్కర్లు, పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
- Advertisement -



