- Advertisement -
కల్వకుంట్ల కవిత
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
మాజీ ప్రధాని పీవీ నరసింహారావు అడుగుజాడల్లో నడుస్తామని టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత తెలిపారు. పీవీ జయంతి సందర్భంగా ఆదివారం హైదరాబాద్ బంజారాహిల్స్ లోని తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో వేడుకలు నిర్వహించారు. పీవీ చిత్ర పటానికి కవిత పూలమాలలేసి నివాళులర్పించారు. తెలంగాణ నుంచి ప్రధానిగా ఎన్నికైన పీవీ ఇక్కడి ప్రజల స్వాభిమానాన్ని ఢిల్లీలో చాటారని కవిత ఈ సందర్భంగా కొనియాడారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఆయనకు ఇవ్వాల్సిన ప్రాధాన్యతను, గౌరవాన్ని ఏనాడూ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన అభిమానులుగా కాంగ్రెస్ పార్టీని ఎన్నటికీ తాము క్షమించబోమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
- Advertisement -



