Monday, June 29, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బాధితుల ఫిర్యాదులను పట్టించుకోని ప్రజావాణి

బాధితుల ఫిర్యాదులను పట్టించుకోని ప్రజావాణి

- Advertisement -

వారం రోజుల్లో న్యాయం చేయకపోతే కుటుంబ సమేతంగా కార్యాలయం ఎదుట నిరాహార దీక్ష
నవతెలంగాణ-మద్నూర్

మండల పరిధిలోని మైసమ్మ చెరువు కట్టకింద ఉన్న భూములను సురేష్ గౌడ్ అతని తమ్ముళ్లు కలిసి వారి భూములకు ఆనుకుని ఉన్న రైతుల పొలాల్లో ఒడ్లను తెగ్గొట్టి భూ కబ్జాకు తెరలేపిన విషయం తెలిసిందే. పొలాల్లో ఒడ్లు లేకుండా చేయడంతో ఎవరి భూములు ఎక్కడున్నాయో తెలియని అయోయంలో ఉన్నామని బాధిత రైతులు ఇప్పటీకే రెండు సార్లు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. తహశీల్దార్ స్పందనతో సర్వేయర్ ఒకసారి కబ్బాకు గురైన పొలాలను పరిశీలించారు. కానీ పూర్తి పరిష్కార దిశగా అధికారులు ఇప్పటివరకు చొరవ చూపలేదు. దీంతో బాధిత రైతుల్లో ఒకరైన హనుమన్లు నేడు ప్రజావాణిలో మరోసారి ఫిర్యాదు చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి, తమ పొలాల్లో ఒడ్లు తొలగించిన వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాదు పట్టా పాసుబుక్కుల ప్రకారం ఎవరి భూమి ఎంత ఉందో హద్దులతో సహా భూములను రైతాంగానికి అప్పగించాలని కోరారు. వారంలోగా సమస్య పరిష్కారం కాకపోతే తన కుటుంబ సభ్యులతో పాటు తహశీల్దార్ కార్యాలయం ముందు నిరాహార దీక్ష చేపడతానని ఫిర్యాదులో పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -