- Advertisement -
నవతెలంగాణ-మద్నూర్
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను పూర్తి చేసుకున్న లబ్దిదారులకు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు అభినందనగా గోడగడియారాలను అందించడం హర్షనీయమని పెద్ద షక్కర్గా గ్రామ సర్పంచ్ విశాలాక్షి అన్నారు. అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే సహకారంతో గ్రామంలో దాదాపుగా 50 ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యాయని చెప్పారు. అవి ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్నాయని తెలిపారు. ఇండ్ల నిర్మాణాలు పూర్తి చేసుకున్న 12 మంది లబ్దిదారులకు ఆమె గోడ గడియారాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో హనుమాన్ టెంపుల్ మాజీ చైర్మన్ రామ్ పటేల్, గ్రామ కార్యదర్శి లక్ష్మణ్ ,పలువురు వార్డు సభ్యులు గ్రామస్తులు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు పాల్గొన్నారు.
- Advertisement -



