Monday, June 29, 2026
E-PAPER
Homeబీజినెస్"స్వరితం 2026" శీర్షికన తమ వార్షికోత్సవ వేడుకలను జరుపుకున్న ముజిగల్ మల్కాజ్‌గిరి అకాడమీ

“స్వరితం 2026” శీర్షికన తమ వార్షికోత్సవ వేడుకలను జరుపుకున్న ముజిగల్ మల్కాజ్‌గిరి అకాడమీ

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : ముజిగల్ మల్కాజ్‌గిరి అకాడమీ తమ వార్షికోత్సవ వేడుకలను “స్వరితం 2026” పేరిట మల్కాజ్‌గిరిలోని అమోఘం బాంక్వెట్స్ సీసీపీఎల్‌లో విజయవంతంగా నిర్వహించింది. ఈ సంగీతోత్సవ వేడుకలలో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సంగీత ప్రియులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇంపెల్ గ్రూప్ – ముజిగల్ ఎడ్యుటెక్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకులు & మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ లక్ష్మీనారాయణ ఏలూరి, ప్రముఖ నేపథ్య గాయకులు వేణు శ్రీరంగం హాజరయ్యారు.

ఈ కార్యక్రమానికి గౌరవ అతిథులుగా ముజిగల్ ఎడ్యుటెక్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ జనార్దన్ రెడ్డి వైజా, సంగీత స్వరకర్త & గాయకుడు ఆర్యన్ శేఖర్, గ్లోబల్ మీడియా హెడ్, టీవీ హోస్ట్ & అంతర్జాతీయ గాయకుడు శరత్ పసుమంతి, మరియు టీఆర్ఎస్ఎంఏ అధ్యక్షుడు ఎస్. మధుసూదన్ హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ హిందుస్థానీ శాస్త్రీయ క్లారినెట్ విద్వాంసులు శ్రీ పండిట్ ఎం. జానకి రాములు, షిర్డీ సాయిబాబా ఉన్నత పాఠశాల కరస్పాండెంట్ మరియు కార్యదర్శి లింగంపల్లి శ్రీధర్, లయన్ లింగంపల్లి అశోక్ కుమార్, మరియు నేపథ్య గాయకులు కామేష్ మంథా లు ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు.

ఈ సాయంత్రం ముజిగల్ విద్యార్థులు అద్భుతమైన గాత్ర , వాద్య ప్రదర్శనలు ఇచ్చారు. వారు తమ ఆత్మవిశ్వాసం, సంగీత నైపుణ్యాలు ప్రదర్శించటం ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ముజిగల్ ఉపాధ్యాయులు కూడా ప్రత్యేక ప్రదర్శనలు ఇచ్చి ఈ వేడుకకు మరింత శోభను చేకూర్చారు. వార్షికోత్సవ వేడుకలలో భాగంగా విద్యార్థుల అంకితభావం, నిరంతర అభ్యాసం మరియు సంగీత విజయాలకు గుర్తింపుగా వారికి సర్టిఫికెట్లు అందజేసి సత్కరించారు. ముఖ్య అతిథులు, ఇతర ప్రముఖులు ఈ సర్టిఫికెట్లను అందజేసి విద్యార్థులను అభినందించటం తో పాటుగా ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల కృషిని ప్రశంసించారు. స్వరితం 2026 విజయాన్ని అభినందిస్తూ, యువ సంగీత ప్రతిభను ప్రోత్సహించటానికి, విద్యార్థులకు ప్రొఫెషనల్ వేదికలపై ప్రదర్శన ఇచ్చే అవకాశాలను అందించడానికి ముజిగల్ మల్కాజ్‌గిరి అకాడమీ చూపుతున్న  నిబద్ధతను పునరుద్ఘాటిస్తూ ఈ కార్యక్రమం ముగిసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -