క్యూబ్, యూఎఫ్ వో, పీఎక్స్ డీ వంటి వీపీఎఫ్ ( వర్చువల్ ప్రింట్ ఫీ) ఖర్చులు చిన్న నిర్మాతలకు భారంగా మారాయి. చిన్న చిత్రాల మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్న ఈ సమస్యను అటు ప్రభుత్వం, ఇటు ఇండస్ట్రీ పెద్దలు పరిష్కరించాలని కోరుతూ ఆర్కే గౌడ్, దీక్ష మూవీ టీమ్ హైదరాబాద్ ఫిలింఛాంబర్ వద్ద మహాధర్నా చేపట్టింది.
నిర్మాత డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ,’ థియేటర్స్ గుత్తాధిపత్యం, వీపీఎఫ్ ఛార్జీల భారం తగ్గించాలి. మన దగ్గర వీపీఎఫ్ ఛార్జీలు ఐదు నుంచి పది లక్షలు అవుతున్నాయి. మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో 2, 3 వేలు మాత్రమే ఉంది. మన దగ్గర పది నుంచి పదిహేను వేల రూపాయలు వారానికి వసూలు చేస్తున్నారు. సినిమా బాగా లేదంటూ రెండు మూడు రోజులకే సినిమా తీసేస్తున్నారు. మరి ఆ వారం రోజులకు కట్టించుకున్న ఛార్జీలు తిరిగి ఇవ్వడం లేదు. సురేష్ బాబు, అల్లు అరవింద్, రమేష్ ప్రసాద్ వీళ్లంతా ఒక్కో డిజిటల్ కంటెంట్ ప్రొవైడర్ తరుపున పనిచేస్తూ కోట్లాది రూపాయలు ఆర్జిస్తున్నారు. మా ఆర్కే దీక్ష సినిమా అన్ని చోట్ల బిజినెస్ అయ్యింది. నైజాంలో థియేటర్స్ ఇవ్వడం లేదు. నాకే కాదు చిన్న సినిమాలందరి పరిస్థితి ఇదే. థియేటర్స్ మీద గుత్తాధి పత్యం, ఇటు డిజిటల్ దోపిడీ చేస్తున్నారు. మల్టీప్లెక్సులు కట్టి, అక్కడ టికెట్ రేట్స్, తినుబండారాల రేట్స్ పెంచి సినిమాకు ఆడియెన్స్ రాకుండా చేస్తున్నారు. అందుకే ఐ బొమ్మ రవికి కూడా ప్రేక్షకుల నుంచి సపోర్ట్ లభించింది. ఇప్పటికైనా మీ తీరు మార్చుకోవాలి. డిజిటల్ ఛార్జీలు తగ్గించాలి. థియేటర్స్ అందరికీ ఇవ్వాలి. లేకుంటే ఈ పోరాటం తీవ్రరూపం దాల్చుతుంది` అని అన్నారు.
డిజిటల్ ఛార్జీలు తగ్గించాలి
- Advertisement -
- Advertisement -



