Tuesday, June 30, 2026
E-PAPER
Homeసినిమాఅందర్నీ అలరించే 'మకుటం

అందర్నీ అలరించే ‘మకుటం

- Advertisement -

సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ మీద 99వ ప్రాజెక్ట్‌గా విశాల్ హీరోగా, దర్శకుడిగా చేస్తున్న చిత్రం ‘మకుటం’. ఆర్ బీ చౌదరి నిర్మిస్తున్న ఈ చిత్రంలో అంజలి, దుషార విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ ‘నచ్చాకే వచ్చేరా’ అనే పాటను విడుదల చేశారు. విశాల్ మాట్లాడుతూ,'ఈసారి దర్శకుడిగా మారి ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాను. ఆర్‌బీ చౌదరిని మిస్ అవుతున్నాను. 99వ ప్రాజెక్ట్‌ బాధ్యతల్ని ఆయన నాకు ఇచ్చారు. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ మూవీకి దర్శకుడిగా మారాను. ఆయన నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాననే అనుకుం టున్నాను. ఆయన బ్యానర్ నుంచి పరిచయం అయిన దర్శకుల్లో నేను 45వ వ్యక్తిని. నాకు ఈ ప్రయాణంలో సాయి ధన్సిక ఎంతో అండగా నిలిచారు. ‘లింగా’ పాట మంచి హిట్ అయింది. అందులో నన్ను సింగర్‌గా చేయడం జీవీ ప్రకాష్ తీసుకున్న రిస్క్ (నవ్వుతూ). ‘నచ్చాకే వచ్చేరా’ పాటను ప్రభ అద్భుతంగా పాడింది. ఆమె పాడిన ప్రతీ పాట బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమా ఎలా ఉంది అనేది నేనే ఆడియెన్స్ వద్దకు వచ్చి తెలుసు కుంటాను. ఓ మంచి సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ ఇస్తాను’ అని అన్నారు. ‘‘మదగదరాజా’ తరువాత విశాల్‌తో కలిసి ఈ సినిమా చేశాను. అప్పుడు విశాల్ హీరో.. ఇప్పుడు దర్శకుడు కూడా. ఇందులో నేను ఓ మంచి, పవర్ ఫుల్ రోల్‌ను పోషించాను అని అంజలి చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -