Tuesday, June 30, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఇరుదేశాల మధ్య 19 ఒప్పందాలు ఖరారు

ఇరుదేశాల మధ్య 19 ఒప్పందాలు ఖరారు

- Advertisement -

సీషెల్స్ పర్యటనలో మోడీ
ఆ దేశ అధ్యక్షుడితో ప్రధాని భేటీలో పలు అంశాలపై చర్చలు
​విక్టోరియా :
యూపీఐ, ఆరోగ్యం, వ్యవసాయం, షిప్పింగ్, అంతరిక్ష రంగం సహా 19 ఒప్పందాలపై భారత్, సీషెల్స్‌లు సంతకాలు చేశాయని ప్రధాని మోడీ వెల్లడించారు. వాతావరణం, గ్రీన్ హైడ్రోజన్, ఇంధనం, బ్లూ ఎకానమీ వంటి వినూత్న రంగాలలో భారత్, సీషెల్స్ పరస్పర సహకారాన్ని కొనసాగిస్తాయని తెలిపారు. సీషెల్స్ అభివృద్ధి ప్రాధాన్యతలకు మద్దతు ఇవ్వడానికి, ఇరు దేశాల మధ్య ఉన్న సన్నిహిత, శాశ్వత భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి భారత్ కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. ఈ మేరకు సీషెల్స్ పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు.”నేను షీషెల్స్‌లో పర్యటిస్తున్నా. ఈ టూర్ నుంచి దేశానికి మంచి ఫలితాలను తీసుకువస్తున్నా. యూపీఐ, ఆరోగ్యం, వ్యవసాయం, షిప్పింగ్, అంతరిక్షం సహా పలు రంగాల్లోని 19 కీలక ఒప్పందాలపై ఇరుదేశాలు సంతకాలు చేశాయి. వీటిలో సీషెల్స్‌లో యూపీఐ అమలుకు సంబంధించిన ఒప్పందం, జన ఔషధిపై ఒప్పందం వంటివి ఉన్నాయి. వాతావరణ పరిరక్షణ, గ్రీన్ హైడ్రోజన్, ఇంధనం, బ్లూ ఎకానమీ వంటి వినూత్న రంగాలలో ఇరుదేశాలు కలిసి పనిచేస్తాయి” అని ప్రధాని మోడీ తెలిపారు.
​పాట్రిక్‌తో మోదీ భేటీ
ఆదివారం మాహేలోని స్టేట్ హౌస్‌లో ప్రధాని మోడీ, సీషెల్స్ అధ్యక్షుడు పాట్రిక్ హెర్మిని భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఇరు దేశాధినేతలు పలు అంశాలపై చర్చలు జరిపారు. భారతదేశం ప్రకటించిన ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ కింద ప్రాజెక్టులు, కార్యక్రమాల అమలులో సాధించిన పురోగతి పట్ల వారు సంతృప్తి వ్యక్తం చేశారు. భారత్, సీషెల్స్ మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 50 ఏండ్లు పూర్తైన సందర్భంగా ఒక ఉమ్మడి స్మారక చిహ్నాన్ని కూడా విడుదల చేశారు. ఈ సందర్భంగా సీషెల్స్ ప్రభుత్వానికి ఒక ఫాస్ట్ పెట్రోల్ వెసెల్‌ను ప్రధాని మోడీ బహుమతిగా ఇచ్చారు. అదనంగా సీషెల్స్ రక్షణ దళానికి 10 యుటిలిటీ వాహనాలు, 5 సెట్ల లేజర్ రేడియల్ క్లాస్ పడవలు, 6 అంబులెన్సులు, 500 మెట్రిక్ టన్నుల బియ్యం, 8,500 మెట్రిక్ టన్నుల సిమెంట్‌ను అందజేస్తామని హామీ ఇచ్చారు.
భారత్, సీషెల్స్ మధ్య కుదిరిన ఒప్పందాలు
యూపీఐ, ఆరోగ్యం, వ్యవ సాయం, షిప్పింగ్, అంతరిక్షం సహా వివిధ రంగాలలో కుదిరిన 19 అవగాహన ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి. అనంతరం రూ. 1,250 కోట్ల విలువైన లైన్ ఆఫ్ క్రెడిట్‌ను పరస్పరం మార్చుకున్నాయి. కాగా, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్ పీ సీఐ), ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ సీషెల్స్ మధ్య ఒక అవగాహనా ఒప్పందం కుదిరింది.
ఈ డీల్ సీషెల్స్‌లో యూపీఐ డిజిటల్ చెల్లింపు మౌలిక సదుపాయాల విస్తరణకు, చెల్లింపుల వ్యవస్థలో విస్తృత సహకారానికి అవకాశాలను అన్వేషించ డానికి వీలు కల్పిస్తుంది.
జాతీయ స్వర్ణోత్సవ వేడుకల్లో మోడీ
సీషెల్స్ జాతీయ దినోత్సవ స్వర్ణోత్సవ వేడుకలకు గౌరవ అతిథిగా ప్రధాని మోడీ హాజరయ్యారు. ఈ వేడుకల్లో ఇండియన్ ఆర్మీ, నేవీలకు చెందిన దళాలు కవాతు చేశాయి. భారత సైనిక బృందం కవాతు చేస్తుండగా ప్రధాని మోడీ నిలబడి వారిని గౌరవించారు. కాగా, సీషెల్స్‌ జాతీయ దినోత్సవ వేడుకలకు హాజరైన తొలి భారత ప్రధాని నరేంద్ర మోడీ కావటం విశేషం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -