Tuesday, June 30, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంనిప్పుల కొలిమిలా యూరప్‌

నిప్పుల కొలిమిలా యూరప్‌

- Advertisement -

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) నివేదిక వెల్లడి
​ జర్మనీలో రికార్డు స్థాయిలో 41.7C ఉష్ణోగ్రత నమోదు
​పోలెండ్ :
మొన్నటి వరకు భారత్‌ ‌నిప్పుల కొలిమిని తలపించింది. అది మరువకముందే ఇప్పుడు యూరప్ దేశాల్లో ఎండలు మండిపోతున్నాయి. తూర్పు వైపు వడగాలులు వీస్తుండటంతో.. పోలాండ్‌లో ఆదివారం 40.5C ఉష్ణోగ్రత నమోదైంది.ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) నివేదిక ప్రకారం.. యూరప్‌లో వేసవి ఆరంభంలోనే వడగాలులతో వందలాది అదనపు మరణాలు సంభవించి ఉండొచ్చని అంచనా వేసింది. తీవ్రమైన వేడి తూర్పు వైపు విస్తరిస్తుండటంతో జర్మనీ, పోలాండ్, చెక్ రిపబ్లిక్‌తో సహా పలు ద్వీపాల్లోనూ మళ్లీ ఉష్ణోగ్రతల రికార్డులు బద్దలయ్యాయి.
జూన్ 21 నుంచి ‘‘యూరప్‌లో అధిక ఉష్ణోగ్రతల కారణంగా 1,300కు పైగా మరణాలు నమోదయ్యాయి’’ అని డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ అధనోమ్ ఘెబ్రేయెసస్ తెలిపారు. ఫ్రాన్స్ జాతీయ ఆరోగ్య మంత్రిత్వ శాఖ గత మూడు నాలుగు రోజుల నుంచి దేశంలో ఊహించిన దానికంటే సుమారు 1,000 అదనపు మరణాలు సంభవించాయని వెల్లడించింది. ‘‘ ప్రపంచ సగటు కంటే రెట్టింపు వేగంతో వేడెక్కుతున్న యూరప్, భూమిపై అత్యంత వేగంగా వేడెక్కుతున్న ఖండం’’ అని టెడ్రోస్ హెచ్చరించారు. ‘‘ప్రస్తుతం ఈ ఖండం అంతటా లక్షలాది మంది ప్రజలు తీవ్రమైన వేడిలో జీవిస్తున్నారు. వందలాది మంది మరణించారు. పాఠశాలలు మూతపడ్డాయి, విద్యుత్ గ్రిడ్లు కుప్ప కూలుతున్నాయి.’’ అని చెప్పారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. దేశంలోని తూర్పు ప్రాంతంలో 41.7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైన తర్వాత, ఆదివారం జర్మనీ వరుసగా మూడవ రోజు కూడా అత్యంత వేడి రోజును చవిచూసింది.తూర్పు బ్రాండెన్‌బర్గ్‌లోని పోలిష్ సరిహద్దుకు సమీపంలో ఉన్న కోషెన్‌లోని ఒక కేంద్రంలో, స్థానిక కాలమానం ప్రకారం సుమారు 16:00 గంటలకు 41.7 సెంటీగ్రెడ్ ఉష్ణోగ్రత నమోదైంది. చెక్ రిపబ్లిక్ రెండు రోజుల్లో తన రెండవ ఉష్ణోగ్రత రికార్డును నెలకొల్పింది. ప్రేగ్‌కు ఉత్తరాన ఉన్న డోక్సానీలో 41.1 సెంటీగ్రెడ్ ఉష్ణోగ్రత నమోదైందని వాతావరణ సంస్థ సీహెచ్ ఎంఐ తెలిపింది. అయితే ఆదివారం నాటికి వేడిమి గరిష్ట స్థాయికి చేరుకుని, ఆ తర్వాత పశ్చిమ ప్రాంతాల్లో తుఫానులు సంభవించే అవకాశం ఉందని అంచనా వేసింది. పోలాండ్‌లోని స్లూబిస్ పట్టణంలో 40.5°C ఉష్ణోగ్రత నమోదై, అది తన సర్వకాలిక ఉష్ణోగ్రత రికార్డును బద్దలు కొట్టిందని, వాతావరణ , జల నిర్వహణ సంస్థ (ఐఎజీడబ్ల్యూ) ప్రతినిధి ఏఎఫ్‌‌పీ వార్తా సంస్థకు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -