వికారాబాద్ జిల్లా జిన్‌గుర్తి హాస్టల్‌లో ఘటన
కాళ్లు విరగడంతో గాంధీ ఆస్పత్రికి తరలింపు
నవతెలంగాణ-తాండూరు
వికారాబాద్ జిల్లా తాండూరు మండలం జిన్‌గుర్తి గ్రామ శివారులో ఉన్న గిరిజన బాలికల వసతి గృహంలో ఆదివారం అర్ధరాత్రి ఇంటర్ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో హాస్టల్ భవనం నుంచి దూకడం కలకలం రేపింది. విద్యార్థిని మహేశ్వరి హాస్టల్ భవనం పై నుంచి పడటంతో ఆమె కాళ్లు విరిగాయి. ఆమెకు మెరుగైన వైద్యం కోసం నగరంలోని గాంధీ ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు
పోలీసులు, తోటి విద్యార్థులు తెలిపిన వివరాల ప్రకారం.. ధారూర్ మండలం మైలారం తండాకు చెందిన మహేశ్వరి జిన్‌గుర్తి వద్ద గల గిరిజన హాస్టల్‌లో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్నది. విద్యార్థిని కొంతకాలంగా ఇంటి, వ్యక్తిగత విషయాల పట్ల ఆందోళనతో ఉంది. ఈ క్రమంలోనే ఆదివారం రాత్రి హాస్టల్ భవనం రెండో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గమనించిన హాస్టల్ సిబ్బంది, తోటి విద్యార్థులు ఆమెను తాండూర్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉంది. అయితే భవనం నుంచి ఆమెనే దూకిందా.. లేక ఎవరైనా తోసేశారా.. అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
సూసైడ్ నోట్‌లో ఆవేదన
ఆత్మహతాయత్నానికి ముందు విద్యార్థిని సూసైడ్ నోట్ రాసింది. ‘ఎన్నో కలలు కన్నా.. ఒక్క డ్రీమ్ నెరవేరలేదు.. భగవంతుడా నేను వెళ్ళిపోతున్నా.. అమ్మానాన్న నన్ను క్షమించండి .. సారీ స్వప్న ప్రియ, నిన్ను వదిలి వెళ్తున్నా బాధపడకు..’ అంటూ మహేశ్వరి సూసైడ్ నోట్‌లో పేర్కొంది. ఈ సూసైడ్ నోట్ ప్రస్తుతం పోలీసులు వద్ద ఉన్నట్టు సమాచారం.
అనుమానాస్పద స్థితిలో హాస్టల్ పై నుంచి దూకిన విద్యార్థి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



