సిర్పూర్‌-కాగజ్‌నగర్‌ రైల్లో లైనర్ల పట్టివేత

సిర్పూర్‌-కాగజ్‌నగర్‌ రైల్లో లైనర్ల పట్టివేత–  చెలరేగిన మంటలు
–  బీబీనగర్‌లో రైలు నిలిపివేత
నవతెలంగాణ-భువనగిరి
సికింద్రాబాద్‌ నుంచి సిర్పూర్‌-కాగజ్‌నగర్‌ వెళ్లే రైెలులో ఆదివారం ఉదయం 8.45 గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దాంతో బీబీనగర్‌లో రైలును నిలిపివేశారు. బ్రేక్‌ లైనర్లు పట్టివేయడంతో ఈ మంటలు వచ్చినట్టు రైల్వే అధికారులు తెలిపారు. రైలు బ్రేక్‌ నుంచి మంటలు చెలరేగడంతో ప్రయాణికులు చైన్‌ లాగి నిలిపివేశారు. సికింద్రాబాద్‌ నుంచి రైల్వే సిబ్బంది వచ్చి సమస్యను గుర్తించి బ్రేక్‌ లైనర్లకు మరమ్మతులు చేపట్టారు. సుమారు 45 నిమిషాల పాటు రైలు నిలిపివేయడంతో ఆ మార్గం గుండా వెళ్లే రైళ్లను ఇతర మార్గం ద్వారా తరలించారు. పలు గూడ్స్‌ రైళ్లను రద్దు చేశారు. పలు రైళ్లు సుమారు గంట నుంచి రెండు గంటల పాటు ఆలస్యంగా నడిచాయి. కాగా, అగ్నిప్రమాదంలో రైల్లో ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు.

Spread the love