ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారికి ఫిర్యాదు
నవతెలంగాణ – మల్హర్ రావు
కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ఓటర్ జాబితా సవరణలో బాగంగా మండలం ఆన్సాన్ పల్లి గ్రామంలో ఎన్నికల నియమావళికి విరుద్ధంగా బిఎల్ఓ గా విధులు నిర్వహిస్తున్న బోయిని నవీన్ ప్రభుత్వ ఉద్యోగి కాదని,ఓప్రయివేటు వ్యక్తిని,గత నాలుగైదు నెలల నుంచి పంచాయతీ కార్యాలయంలో రోజువారీ కూలీగా చేస్తున్నాడని,అతన్ని వెంటనే బిఎల్ఓగా తొలగించి అర్హత ఉన్న వారిని నియమించాలని మంగళవారం బిఆర్ఎస్ 242 బూతు లెవల్ ఏజెంట్ బానోతు రాజుకుమార్ మంథని నియోజకవర్గ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారికి పిర్యాదు చేశారు.బాధ్యతగల ప్రభుత్వ ఉద్యోగిని పెట్టకుండా ఇలాంటి ప్రయివేటు వ్యక్తులను పెట్టడం ద్వారా ఓట్లు అవకతవకలు జరిగే అవకాశం ఉందన్నారు.
ఆ ప్రయివేటు బిఎల్ఓను తొలగించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



