Wednesday, July 1, 2026
E-PAPER
Homeజాతీయంఆర్మీ నూతన చీఫ్‌‌గా జనరల్ ధీరజ్ సేథ్

ఆర్మీ నూతన చీఫ్‌‌గా జనరల్ ధీరజ్ సేథ్

- Advertisement -

న్యూఢిల్లీ : ఆర్మీ స్టాఫ్‌ ‌నూతన చీఫ్‌‌గా జనరల్‌ ‌ధీరజ్‌ ‌సేథ్‌ ‌మంగళవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. సాయుధ దళాలలో 40 ఏళ్లకు పైగా కెరీర్ కలిగిన జనరల్‌ ‌సేథ్‌ పశ్చిమ సరిహద్దు ప్రాంతంలో విజయ వంతంగా నిర్వహించిన రెండు ఆపరేషనల్ ఆర్మీ కమాండ్‌లకు నాయకత్వం వహించారు. జనరల్ ఉపేంద్ర ద్వివేది స్థానంలో సేథ్‌ బాధ్యతలు స్వీకరించారు. జనరల్ ఉపేంద్ర ద్వివేది మంగళవారమే పదవీ విరమణ చేశారు. కాగా, జనరల్ సేథ్ ఖడక్‌వాస్లాలోని జాతీయ రక్షణ అకాడమీ పూర్వ విద్యార్థి. డిసెంబర్ 1986లో ఆర్మర్డ్ కార్ప్స్‌లో నియమితు లవ్వడంతో భారత సైన్యంలో ప్రవేశించారు. ఈ నలభై ఏళ్లలో అనేక హోదాల్లో పనిచేశారు. ఆర్మీ కమాండర్‌‌తో పాటు జైపూర్‌లోని సౌత్ వెస్ట్రన్ కమాండ్, సదరన్ కమాండ్‌లకు జనరల్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్‌గా పనిచేశారు. ఈ సమయంలోనే పశ్చిమ సరిహద్దు ప్రాంతంలో రెండు ఆపరేషనల్ కమాండ్‌లకు నాయకత్వం వహించిన అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. తరువాత 31వ ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ (సిఓఎఎస్‌), వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్‌గా పనిచేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -