సునీల్ భారతీ మిట్టల్ తో సీఎం రేవంత్‌రెడ్డి
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాష్ర్టంలో అతిపెద్ద సమగ్ర డేటా సెంటర్, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ) మౌలిక సదుపాయాల క్యాంపస్‌ను ఏర్పాటు చేసే అవకాశాన్ని పరిశీలించాలని సీఎం ఏ రేవంత్‌రెడ్డి భారతీ ఎంటర్‌ప్రైజెస్ చైర్మెన్ సునీల్ భారతి మిట్టల్‌కు సూచించారు. సోమవారం నాడిక్కడి మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఎమ్‌సీహెచ్చార్డీ)లోని బోధీ పెవిలియన్ లో మిట్టల్ సీఎంను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎం పలు అంశాలను ఆయనతో చర్చించారు. రాష్ర్టంలో ప్రభుత్వ విద్యలో తీసుకువస్తున్న సంస్కరణలను వివరించారు. నైపుణ్యాభివృద్ధి కోసం స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు, ఐటీఐలను ఏటీసీ లు మార్పు, పాలిటెక్నిక్ కళాశాలను అభివృద్ధి వంటి పలు అంశాలను ప్రస్తావించారు. భారతి ఎంటర్‌ప్రైజెస్ ఆధ్వర్యంలో నిర్మితమవుతున్న చందన్‌వెల్లి డేటా సెంటర్ ప్రాజెక్టును వీలైనంత త్వరగా ప్రారంభించాలని కోరారు. హైదరాబాద్‌లో ఎయిర్‌టెల్ డిజిటల్, క్లౌడ్, సైబర్ సెక్యూరిటీ, ఏఐ కార్యకలాపాలపైన దృష్టి పెట్టాలన్నారు. భవిష్యత్ పెట్టుబడి అవకాశాలు, సమస్యలను పరిష్కారం కోసం రాష్ర్ట ప్రభుత్వంతో కలిసి పనిచేసేలా సీనియర్ ఎగ్జిక్యూటివ్‌ను నామినేట్ చేసి సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా సునీల్ మిట్టల్ మాట్లాడుతూ భారతీ పౌండేషన్ ద్వారా ప్రభుత్వ పాఠశాలలు, ఏటీసీల్లో చదువుకునే విద్యార్థులకు స్కాలర్ షిప్ లు అందజేస్తామన్నారు. ఎయిర్ టెల్ కు హైదరాబాద్ రెండో హెడ్ క్వార్టర్ గా ఉంటుందని చెప్పారు. డేటా సెంటర్ల కెపాసిటీని మరింత పెంచడానికి ముందుకు వస్తామనీ, ఫైబర్ కనెక్టివిటీ మరింత పెంచుతామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు కూడా పాల్గొన్నారు.
ఏఐ, డేటా సెంటర్లు ఏర్పాటు చేయండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



