సీపీఐ(ఎం) సందేశం
న్యూఢిల్లీ: చైనా కమ్యూనిస్ట్ పార్టీ (సిపిసి) 105వ వార్షికోత్సవం సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్ట్) హృదయపూర్వక అభినందనలు తెలియజేసింది. సిపిఎం కేంద్ర కమిటీ బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో, చైనాను అద్భుతమైన పరివర్తన దిశగా నడిపించడంలో సీపీసీ దార్శనికత, స్థితిస్థాపకత, అంకిత భావాన్ని ప్రశంసించింది. 1921లో స్థాపించిన సీపీసీ, గత 105 సంవత్సరాలుగా చైనా ప్రజలను అర్థ భూస్వామ్య, అర్ధ వలస స్థితి నుండి, పేదరికం, విచ్ఛిన్నత నుండి బయటపడేసిందని సీపీఐ(ఎం) పేర్కొంది. నేడు, చైనా ఆర్థికా భివృద్ధి, సాంకేతిక ఆవిష్కరణలు, పేదరిక నిర్మూలనలో ప్రపంచ నాయకుడిగా అవతరించిందని, వందల మిలియన్ల మంది ప్రజలను దారిద్య్రం నుండి బయటపడవేయడం మానవ చరిత్రలో ఒక గొప్ప విజయంగా నిలిచిందని ఆ ప్రకటనలో ప్రశంసించింది. జిన్ పింగ్ నేతృత్వంలోన సీపీసీ, పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా తన ప్రజల నిర్దిష్ట పరిస్థితులు, ఆకాంక్షలకు అనుగుణంగా సోషలిస్ట్ నిర్మాణ మార్గాన్ని అనుసరించిందని సీపీఐ(ఎం) అభినందించింది. ‘చైనీస్ లక్షణాలతో కూడిన సోషలిస్ట్ నిర్మాణం’ అనే సైద్ధాంతిక ఆవిష్కరణ, దేశాలు శ్రేయస్సు, సామాజిక న్యాయం, జాతీయ పునరుజ్జీవనం వైపు తమ సొంత మార్గాన్ని రూపొందించుకోవచ్చని నిరూపించిందని అభిప్రాయ పడింది.
ప్రస్తుత ప్రపంచంలో నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక అనిశ్చితి, వాతావరణ మార్పుల సవాళ్ల నేపథ్యంలో చైనా సాధించిన ఈ విజయాలు మరింత ప్రాముఖ్యతను సంతరించుకు న్నాయని సీపీఐ(ఎం) తెలిపింది. బహు పాక్షికత, శాంతియుత అభివృద్ధి, దక్షిణార్థ గోళానికి సహకారానికి చైనా నిబద్ధత ప్రపంచ వ్యవహారాలకు స్థిరీకరణ, నిర్మాణాత్మక సహకారాన్ని అందిస్తుందని పేర్కొంది. పరస్పర గౌరవం , ఐక్యరాజ్యసమితి చార్టర్ సూత్రాలపై ఆధారపడిన బహుళ ధ్రువ ప్రపంచ క్రమం కోసం చైనా పిలుపు , మరింత సమానమైన అంతర్జాతీయ వ్యవస్థను కోరుకునే అనేక దేశాల ఆకాంక్షలతో ప్రతిధ్వనిస్తుందని సిపిఎం అభిప్రాయపడింది. ఆధునిక సోషలిస్ట్ దేశం సమగ్ర నిర్మాణాన్ని లక్ష్యంగా చేసుకుని సిపిసి తన తదుపరి మిషన్‌ను ప్రారంభించినందున, రెండు దేశాల ప్రజలకు, ప్రపంచం మొత్తానికి శాంతి, పురోగతి పట్ల నిరంతర స్నేహం, సహకారం, భాగస్వామ్య నిబద్ధత కోసం ఎదురుచూస్తుందని సిపిఎం కేంద్ర కమిటీ తన సందేశంలో పేర్కొంది. ఈ చారిత్రాత్మక మైలురాయి సందర్భంగా మరోసారి అభినందనలు తెలియజేస్తూ, రాబోయే శతాబ్దం పార్టీకి, చైనా ప్రజలకు, ప్రపంచానికి మరింత గొప్ప విజయాలను తీసుకురావాలని సిపిఎం ఆకాంక్షించింది.
చైనా కమ్యూనిస్ట్ పార్టీ (సిపిసి)కి అభినందనలు
- Advertisement -
- Advertisement -



