Thursday, July 2, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్డాక్టర్ల సేవలు అమూల్యం

డాక్టర్ల సేవలు అమూల్యం

- Advertisement -

–  రోటరీ క్లబ్ అధ్యక్షుడు సబ్బని కృష్ణ హరి
నవతెలంగాణ – కామారెడ్డి

రోటరీ క్లబ్ ఆఫ్ కామారెడ్డి ఆధ్వర్యంలో అంతర్జాతీయ డాక్టర్స్ డే వేడుకలను క్లబ్ ఆడిటోరియంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ  కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి  డా. జె. వెంకట్, ఆత్మీయ అతిథిగా కామారెడ్డి ఐఎంఏ అధ్యక్షుడు డా. మల్లికార్జున్ రావు, ప్రోగ్రామ్ చైర్మన్‌గా డా. కె. వెంకట్రాజం పాల్గొన్నారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ అధ్యక్షుడు సబ్బని కృష్ణ హరి మాట్లాడుతూ వైద్య వృత్తిని కేవలం ఉపాధిగా కాకుండా సేవా దృక్పథంతో నిర్వర్తిస్తూ, రోగుల బాధలను తమ బాధలుగా భావించి రాత్రింబగళ్లు ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం కృషి చేసే డాక్టర్ల సేవలు సమాజానికి ఆదర్శమని కొనియాడారు.

ఈ సందర్భంగా కామారెడ్డి పట్టణంలో విశిష్ట వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ చింత శుభశ్రీ, డాక్టర్ చందరి సంతోష్, డాక్టర్ ఘనశ్యామ్ పటేల్, డాక్టర్ రేనికింది మానస, డాక్టర్ ఎర్రోళ్ల స్నేహ, డాక్టర్ కొంగి దివ్యభారతి, డాక్టర్ పల్స హరీష్ గౌడ్‌లను శాలువాలు, జ్ఞాపికలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ కార్యదర్శి సోమిశెట్టి సంతోష్, కోశాధికారి మాటూరి బైరయ్య, మాజీ అధ్యక్షుడు యాచం శంకర్, మాజీ గవర్నర్ ముసుకు జైపాల్ రెడ్డి, సభ్యులు మాటూరి శ్రీశైలం, బండమీది రాజేశం, దూస వెంకటస్వామి, డాక్టర్ బాలరాజ్, ధనంజయ, వెంకటరమణ, కమ్మరి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -