నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్లలోని వెల్మలపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను గురువారం భూపాలపల్లి జిల్లా విద్యాశాఖాధికారి రాజేందర్, గ్రామ సర్పంచ్ బండి స్వామి,ఎంఈఓ లక్ష్మన్ బాబు,తాడిచెర్ల హైస్కూల్ హెచ్ఎం తిరుపతి పున:ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. పూర్వ విద్యార్థుల కృషి, వెల్మలపల్లి విద్యార్థుల తల్లిదండ్రులు ప్రోత్సాహంతో పాఠశాల పరిశుభ్రం చేయడం అభినందనీయమన్నారు. వారి అభ్యర్థన మేరకు పాఠశాలనుబిప్రారంభించడం జరిగిందని తెలిపారు. పాఠశాలలో విద్యార్థుల అడ్మిషన్ల శాతం పెంచేందుకు కృషి చేయాలన్నారు. పాఠశాలకు పర్మిచర్, విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులతో పాటు స్థానిక ప్రజలు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
వెల్మలపల్లి పాఠశాలను ప్రారంభించిన డీఈఓ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



