Thursday, July 2, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అంగన్వాడీల అభివృద్ధికి ప్రభుత్వం కృషి: సర్పంచ్

అంగన్వాడీల అభివృద్ధికి ప్రభుత్వం కృషి: సర్పంచ్

- Advertisement -

నవతెలంగాణ-మద్నూర్
ప్రజా పాలన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంగన్వాడీల అభివృద్ధికి ప్రత్యేకంగా కృషి చేస్తుందని గోజేగావ్ సర్పంచ్ భరత్ రాథోడ్ అన్నారు. బుధవారం ఆయన అంగన్వాడీ చిన్నారులకు దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రతినెల చిన్నారుల బరువు, ఆరోగ్యం పట్ల ప్రత్యేకంగా అంగన్వాడీ టీచర్లు ప్రత్యేక శ్రద్ద వహించాలని సూచించారు. గర్భిణీలకు, బాలింతలకు పౌస్టికాహారాన్ని సకాలంలో అందించాలని కోరారు. ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలను ప్రజలు వినియోగించుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో పంచాయితీ కార్యదర్శి, అంగన్వాడీ టీచర్, ఆయా, చిన్నారుల తల్లిదండ్రులు, చిన్నారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -