నవతెలంగాణ-మిడ్జిల్
జడ్చర్ల అర్బన్, రూరల్ మండలాలుగా ప్రకటించి, కొల్లూరు గ్రామాన్ని మండలం ఏర్పాటుచేసి జడ్చర్ల ను రెవిన్యూ డివిజన్ గా ప్రకటించాలని అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్, ఆర్డీవో నవీన్ కు, జెడ్పి సీఈవో వెంక రెడ్డి, మండల అధికారులకు జడ్చర్ల రెవిన్యూ డివిజన్ సాధన సమితి కోఆర్డినేటర్లు వడ్త్యావత్ రమేష్ నాయక్, బూరుగుపల్లి కృష్ణ యాదవ్, గురువారం మండల కేంద్రంలో వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నాలుగో తేదీ నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మిడ్జిల్ మండలంలని వస్తున్న సందర్భంగా జిల్లా అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించే విధంగా కృషి చేయాలని కోరారు. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి రెవిన్యూ డివిజన్ ఏర్పాటుకు కృషి చేయాలని అదేవిధంగా
సాధన సమితి సభ్యులను ముఖ్యమంత్రి వద్దకు తీసుకెళ్లే విధంగా కృషి చేయాలని కోరారు. జడ్చర్ల పట్టణం వేగంగా అభివృద్ధి చెందుతున్నందున, ప్రజలకు పరిపాలనా సేవలు మరింత సులభంగా అందించేందుకు జడ్చర్లను రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం తాసిల్దార్ రాఘవేందర్ రెడ్డి కి ఇన్చార్జి ఎంపీడీవో ఆనంద్ వినతిపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో గొడుగు నర్సీములు తదితరులు పాల్గొన్నారు.



