ప్రభుత్వ బాలుర ఐటిఐ కాలేజీలో సమస్యలను పరిష్కరించాలి

నవతెలంగాణ – కంటేశ్వర్
ప్రభుత్వ బాలుర ఐటిఐ కాలేజీలో సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం భారత విద్యార్థి ఫెడరేషన్ నగర కమిటీ ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరంలో శివాజీ నగర్ వద్ద గల ఐటిఐ బాలుర కాలేజి సమస్యలను పరిష్కరించాలని ఐటిఐ ప్రిన్సిపాల్ కి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా నగర ఉపాధ్యక్షులు గణేష్ మాట్లాడుతూ.. వృత్తి విద్యా విధానం అయినటువంటి ఐటిఐ కాలేజీలో గత కొన్ని రోజులుగా కరెంట్ లేకపోవడం వలన విద్యార్థులకు ప్రాక్టీకల్స్ సరిగ్గా జరగడం లేదు.అదే విధంగా థీరి క్లాసులు కూడా క్లాసు బయట జరుగుతున్న పట్టించుకునే నాథుడే లేకపోవడం బాధాకరం అని అన్నారు. నిజామాబాద్ లోని ఐటిఐ కాలేజీలకు సంబంధిత అధికారి బాలుర ఐటిఐ కాలేజీకి ప్రిన్సిపాల్ అయిన సరిపడా నిధులు లేని కారణంగా సమస్యలు పరిష్కారం అవ్వడం లేదు.అలాగే ఐటిఐ ప్రిన్సిపాల్ సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తాని హామీ ఇచ్చారు.అలాగే ప్రజాప్రతినిధులు మరియు అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి ఈ సమస్యలను పరిష్కరించాలని లేని యెడల విద్యార్థులందరిని ఏకం చేసి పోరాటాలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఐటిఐ కాలేజి కమిటీ సభ్యులు తరుణ్ ,వర్ధన్,శ్రీనివాస్ ,ప్రమోద్, శివ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love